బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి : పసుపు కుంకుమ చెక్కులు డిపాజిట్ చేశారు

ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద  సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.  

  • Published By: chvmurthy ,Published On : April 8, 2019 / 09:51 AM IST
బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి : పసుపు కుంకుమ చెక్కులు డిపాజిట్ చేశారు

Updated On : April 8, 2019 / 9:51 AM IST

ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద  సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.  

అమరావతి: ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద  సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అమరావతిలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు విడతల్లో 20 వేల రూపాయలు  డ్వాక్రా సంఘ సభ్యులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
Read Also : శివాజీకి పరిజ్ఞానం లేదు: పోసాని

4 వ విడత రైతు రుణ మాఫీ నిధులు కూడా విడుదల చేశామని, మే 23  లోపు 5 వ విడత రైతు రుణ మాఫీ నిధులు విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.  4వ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్ల  రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. దాదపు  30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున నగదు జమ కానుంది.

పలు ప్రభుత్వ సంక్షేమ పధకాలలకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు ఆయన సోమవారం అమరావతిలో చెప్పారు. రైతులు తమ వద్ద ఉన్న రుణ అర్హత పత్రాన్ని, ఐడీ ప్రూఫ్ ను  బ్యాంకులో  సబ్మిట్ చేస్తే,  వడ్డీతో సహా సొమ్ము చెల్లించడం జరుగుతుందని కుటుంబరావు వివరించారు. అన్నదాత సుఖీభవ  చెక్కులు కూడా ఖరీప్ లోగా క్లియర్ చేస్తామని ఆయన చెప్పారు. 
Read Also : తోట త్రిమూర్తులకు పవన్ హెచ్చరిక : అన్నయ్య మాటే విన.. మీ మాట వింటానా ?