జగన్..నాతో పెట్టుకుంటే కుర్చీ కూలుతుంది..మీ150 మంది ఎమ్మెల్యేలతో పొలం దున్నిస్తా : పవన్

నన్ను..నా పర్యటనను అడ్డుకుంటే సీఎం జగన్ కుర్చీ కదులుద్దని..కుర్చీ కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పై పర్యటిస్తున్న పవన్ కళ్యాణ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు మత మార్పిడులపై ఉన్న ఉత్సాహం రైతులపై లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోకుంటే 150మంది ఎమ్మెల్యేలతో పొలం దున్నిస్తాననీ..ప్రజాప్రతినిథులకు రైతుల కష్టం అంటే ఏంటో తెలియజేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం జగన్ ఇళ్లు కూల్చటం..కాంట్రాక్టులు రద్దు చయేటం తప్ప ఇంకేమీ చేయలేదనీ..కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రైతుల్ని పట్టించుకోవటంలేదనీ ఆరోపించారు. ఇంతకంటే సీఎం జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఒక చేత్తోగడ్డ పార పట్టుకుని సీఎం కట్టడాలు కూలగొట్టటానికే పాలన అన్నట్లు చేస్తున్నారనీ..మరో చేత్తో పెన్ను పట్టుకుని గతంలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసుకుంటూ పోవటం తప్పించి ప్రజల గురించి..పాలన గురించి..రైతుల గురించి పట్టించుకున్న పాపానపోలేదనీ ఘాటు విమర్శలు చేశారు.
ఇసుక పాలసీ అంటూ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందనీ..కార్మికుల ఆత్మహత్యలకు కారణమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
150మందిని గెలుసుకుని గద్దెనెక్కి ప్రజల కష్టం తీర్చలేనీ మీ ఎమ్మెల్యే ఎందుకు అన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాననీ పదే పదే చెప్పే సీఎం జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు.