వింటర్ టూర్ : హైదరాబాద్‌కు రాష్ట్రపతి

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 07:34 AM IST
వింటర్ టూర్ : హైదరాబాద్‌కు రాష్ట్రపతి

Updated On : December 20, 2019 / 7:34 AM IST

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఆయన బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచీ అధికారులు భద్రతను పర్యవేక్షించారు. శీతాకాల విడిది కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్ – ఎయిర్ ఫోర్స బెటాలియన్ 2, 3 గేట్లు, బొల్లారం చెక్ పోస్టు, సహేజ్ ద్వార్,

ఈఎంఈ సెంటర్ వదద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్ పంప్ హౌస్, బిసిన్ ఎన్విరాన్ మెంట్ పార్కు, బిసిన్ హెడ్ క్వార్టర్స్, మెయిన్ గేట్, యాప్రాల్ బిసిన్ బేకరీ ఎక్స్ టెన్షన్, నేవీ హౌస్ జంక్షన్, ఆంధ్రా సబ్ ఏరియా ఆఫీసర్స్ మెస్, ఆర్ఎస్ఐ జంక్షన్, ఈఎంఈ సెంటర్ హౌస్ గేట్ నెంబర్ 3, 2, 1, రాష్ట్రపతి నిలయం మెయిన్ గేట్ వరకు ఆంక్షలు ఉంటాయి.

* బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు బస చేయనున్నారు. 
* 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నారు. 
 

* అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు. 
* 26న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. 
* మరుసటి రోజు 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read More : కంగ్రాట్స్ : గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ పురస్కారం