MCD: దమ్ముంటే ఎదురుగా వచ్చి పోటీ చేయండి.. ఢీల్లీ మేయర్ ఎన్నికపై బీజేపీకి ఆప్ ఛాలెంజ్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్‭ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తాజాగా బీజేపీ ప్రకటించింది.

MCD: దమ్ముంటే ఎదురుగా వచ్చి పోటీ చేయండి.. ఢీల్లీ మేయర్ ఎన్నికపై బీజేపీకి ఆప్ ఛాలెంజ్

Raghav Chadha dares BJP to fight Delhi Mayoral polls directly

Updated On : December 24, 2022 / 8:52 PM IST

MCD: ఢిల్లీ మున్సిపాలిటీ మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని పెట్టకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా విమర్శలు గుప్పించారు. దమ్ముంటే నేరుగా వచ్చి తమపై పోటీ చేయాలని బీజేపీకి ఛాలెంజ్ విసిరారు. తమకు ఎదురొచ్చే దమ్ము లేక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయమని ఢిల్లీ బీజేపీ యూనిట్ ప్రకటించారు. ఇప్పుడు ఉన్నట్టుండి స్వతంత్ర అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చి పోటీకి దింపారు. ఎందుకు ఈ దాగుడు మూతలు. దమ్ముంటే నేరుగా వచ్చి పోటీ చేయండి’’ అని అన్నారు.

Black Mamba Snake: క్రిస్మస్ ట్రీ కింద విషపూరిత పాము.. చూసి వణికిపోయిన కుటుంబం

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్‭ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తాజాగా బీజేపీ ప్రకటించింది. ఇక స్వతంత్ర కార్పొరేట్లను బీజేపీ బెదిరిస్తోందని ఆప్ ఆరోపించింది. వారి తలలపై తుపాకులు పెట్టి తమకు అనుకూలంగా ఓట్ వేయాలని కొందరు బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు ఆప్ ఆరోపణలు చేసింది.

Bangladesh vs India: క్యాచులు వదిలేసి అసహనం తెప్పించిన కోహ్లీ.. వీడియో వైరల్