ఎందుకు చనిపోతున్నారు : కర్నూలు రైతులతో రేణుదేశాయ్
కర్నూలు: రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

కర్నూలు: రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
కర్నూలు: రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం(ఫిబ్రవరి-25-2019) ఆమె మంత్రాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలూరు మండలం వెళ్లారు. తుంబళబీడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. 2018 ఆగస్టులో ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ఏడాది డిసెంబర్‌లో పెద్దకడబూరుకు చెందిన రైతు పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. రేణూ మృతుల కుటుంబాలతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?
రైతు సమస్యల కథాంశంతో రేణూ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు. అందుకు సంబంధించిన కథాంశం కోసం రైతు కుటుంబాలతో నేరుగా మమేకమవుతున్నారు. అన్నదాతల పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారి కుటుంబాలను పరామర్శించి వారి కథలను తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని రేణూ భావిస్తున్నారు. రేణూ.. దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తూ రైతుల సమస్యలపై సినిమా తీస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Read Also: మిస్టరీ ఉందా : మలయాళ దర్శకురాలు నయన్ మృతి
అందుకోసం స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే వర్క్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని రేణూ తెరకెక్కించారు. ఇఫ్పుడు రైతులపై సినిమాను అన్ని భారతీయ భాషల్లో చిత్రీకరించనున్నారని సమాచారం. ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. 3 రోజులు సీమ జిల్లాల్లో టూర్ చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఓ వైపు పవన్.. మరోవైపు రేణూ దేశాయ్… ఇద్దరూ కర్నూలు జిల్లాలోనే ఉండటం ఆసక్తిగా మారింది.
Read Also: తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ