CAAను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అవుతారా?

‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్‌కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మానాన్ని 2020, మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…
ముస్లింలను మినహాయించడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. అందుకే..ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించాలని కోరారు. సీఏఏ బిల్లు దేశ వ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారి తీసిందన్నారు. స్పష్టమైన అవగాహనతోనే CAA, NRCని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వాజ్ పేయి హయాంలో అద్వానీ ఆధ్వర్యంలో 2003లో CAAపై కమిటీ వేశారని తెలిపారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సర్వే చేశారన్నారు.
కేవలం 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారని, అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందన్నారు. పనుల కోసం వలసలు పోయిన వారి గతేం కావాలని సభలో ప్రశ్నించారు. సొంత బర్త్ సర్టిఫికేట్లు లేని వారు దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారని, 130 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కాందిశీకులుగా గుర్తించిన విషయాన్ని తెలిపారు. సీఏఏ కారణంగా దేశ ప్రతిష్ట మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లౌకిక పునాదుల మీద నిర్మితమైన పార్టీ టీఆర్ఎస్ అని, తమ పార్టీకి 50 దేశాల్లో శాఖలున్నాయన్నారు. ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని..దీనిని ఎవరూ కాదనలేమని..అలాగే చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ కూడా చెప్పరన్నారు.
Read More : CAA వద్దే వద్దు: గోలీ మారో సాలోంకు అంటారా ఏం భాష – కేసీఆర్