RK Roja : పవన్‌తో కావడం లేదని రజనీకాంత్‌ను పిలిపించారు- చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

RK Roja : గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.

RK Roja : పవన్‌తో కావడం లేదని రజనీకాంత్‌ను పిలిపించారు- చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

RK Roja (Photo : Google)

Updated On : May 1, 2023 / 9:32 PM IST

RK Roja : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు డేంజరస్ అండ్ డర్టీ పొలిటీషియన్ అని అన్నారు. గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కావడం లేదని తమిళనాడు నుండి రజనీకాంత్ ను పిలిపించుకుని చంద్రబాబు పొగిడించుకుంటున్నారు అని మంత్రి రోజా విమర్శించారు. గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు ఎన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.

తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ సీఎం కప్ క్రికెట్ పోటీ ఫైనల్ ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Also Read..Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ ఫైనల్ పోటీలు తిరుపతిలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళు ఏపీ సీఎం కప్ కు చేరుకున్నారని చెప్పారు. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఎక్కడా నిరుత్సాహ పడొద్దు. ప్రతి ఒక్కరూ లక్ష్యం దిశగా చేరుకోవాలి అని మంత్రి రోజా అన్నారు. ”నా జీవితమే ఆదర్శం. నేను చాలా కష్టపడ్డాను. ఎన్నో బాధలు పడ్డాను. అడవిని ఆనుకుని ఉన్న భాకరాపేట గ్రామంలో పుట్టి ఈరోజు మంత్రిగా మీ ముందు నిల్చున్నా. ఆటల్లో గెలుపోటములు సహజం. ప్రతి ఒక్కటి స్పోర్టివ్ గా తీసుకోవాలి” అని మంత్రి రోజా సూచించారు.

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, శాప్ చైర్మన్..
నా జీవితంలో సీఎం జగన్ నాకు ఆదర్శం. మంత్రి రోజా కూడా ఆదర్శం. నిత్యం ప్రజలు సమస్యలు తెలుసుకుంటూనే.. అటు సినీ రంగంలో, ఇటు ప్రజా జీవితంలో ఒక లెజెండరీ లీడర్ గా గుర్తింపు పొందారు మంత్రి రోజా. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. స్నేహితులను గౌరవించండి. రానున్న రోజుల్లో మరింత అడ్వాన్స్ గా మరిన్ని గేమ్స్ తో ఏపీ సీఎం కప్ ను నిర్వహిస్తాం.

Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..