Sachin Pilot: మిజోరాం మీద కాంగ్రెస్ నేత బాంబులు వేశారా.. కొడుకు సచిన్ పైలట్ ఏమన్నారంటే?
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.

Amit Malviya: భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎదురుదాడికి దిగారు. ఆయన తండ్రి రాజేష్ పైలట్ తూర్పు పాకిస్థాన్‌పై బాంబులు వేసే క్రమంలో మిజోరంపై కాకుండా వేసారని చేసిన వ్యాఖ్యలను పైలట్ తిప్పి కొట్టారు. వాస్తవాలను సరిదిద్దాలని మాల్వియాకు పైలట్ సలహా ఇచ్చారు. అక్టోబరు 29, 1966న తన తండ్రి భారత వైమానిక దళంలో నియమితులయ్యారని, అప్పటి రాష్ట్రపతి జారీ చేసిన లేఖను విడుదల చేశారు. చివరగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమిత్ మాల్వియాకు సచిన్ పైలట్ శుభాకాంక్షలు తెలిపారు.
Independence Day: ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చేసిన 10 ముఖ్యమైన ప్రకటనలు
వాస్తవానికి, రాజేష్ పైలట్ భారత వైమానిక దళంలో ఉన్నప్పుడు 1966లో మిజోరంపై బాంబులు విసిరారని పేర్కొంటూ అమిత్ మాల్వియా ట్విటర్(ఎక్స్)లో ఒక వార్తా ఛానెల్ యొక్క వీడియోను షేర్ చేశారు. “రాజేష్ పైలట్, సురేష్ పైలట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను నడుపుతున్నారు. మార్చి 5, 1966న మిజోరం రాజధాని ఐజ్వాల్‌పై వారు బాంబులు విసిరారు. ఆ తర్వాత వారిద్దరూ కాంగ్రెస్ ఎంపీలు అయ్యారు. ఆ తర్వాత మంత్రులు కూడా అయ్యారు. రాజకీయ అవకాశాల ద్వారా ఈశాన్య ప్రాంతంలో తోటి పౌరులపై వైమానిక దాడులు చేసిన వారిని ఇందిరా గాంధీ సత్కరించారు’’ అని ట్వీట్ చేశారు.
Maharashtra Politics: ఆ పార్టీతో చేతులు కలిసి శరద్ పవార్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఉద్ధవ్ థాకరే
ఇక మాల్వియా ఆరోపణలపై సచిన్ పైలట్ స్పందిస్తూ.. ‘‘మీరు తప్పుడు తేదీలు చెప్పారు. వాస్తవాలు వేరే ఉన్నాయి. అవును, నా దివంగత తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా బాంబులు విసిరారు. కానీ అది 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో అప్పటి తూర్పు పాకిస్తాన్‌పై జరిగింది. మీరు చెప్పినట్లు మార్చి 5, 1966న మిజోరాం మీద కాదు. ఆయన 29 అక్టోబర్ 1966న భారత వైమానిక దళంలో నియమించబడ్డారు. కావాలంటే ఈ సర్టిఫికేట్ చూడండి’’ అని ట్వీట్ చేశారు.
అయితే ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు. ఈ రోజు కూడా మిజోరాం ప్రతి సంవత్సరం మార్చి 5న సంతాప దినాలను పాటిస్తుందని, అది ఇంకా మర్చిపోలేదని, కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని దేశం నుంచి దాచిపెట్టిందని అన్నారు.
Viral Video: స్వాంతంత్ర్య దినోత్సవాన ఓ సరదా వీడియో.. చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు
ప్రధాని మోదీపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సమర్థించారు. పాకిస్తాన్, చైనాల మద్దతుతో మిజోరంలో వేర్పాటువాద శక్తులను ఎదుర్కోవడానికి 1966 మార్చిలో ఇందిరాగాంధీ అనూహ్యంగా తీసుకున్న కఠినమైన నిర్ణయంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారు.