Chandrababu Naidu : జగన్‌కు మేలు జరుగుతుందని భయపడుతున్నారు, అందుకే ఇలా- చంద్రబాబుపై సజ్జల, పేర్నినాని ఫైర్

పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు.

Chandrababu Naidu : జగన్‌కు మేలు జరుగుతుందని భయపడుతున్నారు, అందుకే ఇలా- చంద్రబాబుపై సజ్జల, పేర్నినాని ఫైర్

Sajjala Slams Chandrababu Naidu

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని ఫైర్ అయ్యారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబును వారు టార్గెట్ చేశారు. వాలంటీర్ల మీద చంద్రబాబు మొదటి నుంచి కక్ష పెట్టుకున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు సజ్జల. ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం అని ధ్వజమెత్తారు. వాలంటీర్లు ఉంటే జగన్ కు మేలు జరుగుతుందని చంద్రబాబుకు భయం అని సజ్జల అన్నారు.

చంద్రబాబుకు వాలంటీర్ల వ్యవస్థ అంటే గిట్టదని పేర్నినాని అన్నారు. అందుకే వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆరోపించారు. పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు కక్ష కట్టారని ధ్వజమెత్తారు పేర్నినాని. పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు పేర్నినాని. సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ టీడీపీ బినామీ సంస్థ అని ఆయన ఆరోపించారు.

Also Read : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?