Pawar on Rahul: రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్

ఢిల్లీ లోక్‌సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు

Pawar on Rahul: రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్

Updated On : October 4, 2023 / 8:47 PM IST

Pawar on Rahul: ‘భారత్ జోడో యాత్ర’ తర్వాత రాహుల్ గాంధీని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం అన్నారు. దేశాన్ని ఏదో ఒకరోజు ఆయన నడిపిస్తారని పవార్ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం అయింది. ఈ యాత్ర దేశంలోని అనేక రాష్ట్రాల గుండా 7 సెప్టెంబర్ 2022న బయలుదేరి 30 జనవరి 2023న శ్రీనగర్‌లో ముగిసింది.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో శరద్ పవార్ మాట్లాడుతూ, “భారత్ జోడో యాత్ర తర్వాత, రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఒక రోజు ఆయన దేశానికి నాయకత్వం వహిస్తారు” అని ఎన్సీపీ తిరుగుబాటుదారులను ప్రస్తావిస్తూ అన్నారు. బీజేపీ, ఎన్సీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలకు భయపడి పార్టీ మారారన్నారు. బీజేపీతో తమ పార్టీ చేతులు కలిపే ప్రసక్తే లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.

సంజయ్ సింగ్ అరెస్టుతో ఇండియా మైత్రి బలపడుతుంది
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ చర్య ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అదే సమయంలో, ఢిల్లీ లోక్‌సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో 50 శాతం లోక్‌సభ సీట్లు గెలుస్తాం
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తాము నాలుగు సీట్లు మాత్రమే గెలిచామని, అయితే ఈసారి 50 శాతం సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పవార్ అన్నారు.

ఇవి కూడా చదవండి: 

Sanjay Singh Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అరెస్ట్

Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల