YSRCP MPS : ఎంపీగా నై.. ఎమ్మెల్యేగా సై.. వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఎమ్మెల్యేగా పోటీకి ఎంపీల ఆసక్తి.. ఎవరా ఎంపీలు? కారణాలేంటి? 10టీవీ Exclusive Report
ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఎవరెవరు?వారి పేర్లు ఏంటి? వారిది ఏ నియోజకవర్గం? అసలు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రావాలనుకుంటున్నారు?YSRCP MPs

YSRCP MPs To Contest MLAs
MPs To Contest MLAs : ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీలో పాలిటిక్స్ మరింత ఇంట్రస్టింగ్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు వద్దు ఎమ్మెల్యే టికెట్టే ముద్దు అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వైసీపీ నేతలు ఈసారి మాత్రం అసెంబ్లీవైపు ఆశగా చూస్తున్నారు. అధినేతను ఎలాగైనా ప్రసన్నం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవులు కూడా దక్కుతాయన్న ఆలోచనలో ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఎవరెవరు?వారి పేర్లు ఏంటి? వారిది ఏ నియోజకవర్గం? అసలు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రావాలనుకుంటున్నారు? దానికి దారితీసిన ఆరు కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ లిస్ట్ 10టీవీ చేతికి చిక్కింది.
ఎంపీలు ఎమ్మెల్యేలుగా కావాలని బలంగా కోరుకోవడానికి ప్రధానమైన కారణాలు..
* ఎమ్మెల్యేలకే జనంలో ఆదరణ ఎక్కువ అని ఎంపీల్లో ఫీలింగ్
* నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలదే పెత్తనం అనే భావన
* పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు ఉండేవారికే ఎంపీ పదవి ఉపయోగం అనే అభిప్రాయం
* జనం మనిషి కాలేకపోతున్నామనే ఆందోళన
* స్థానికంగా అధికారులు ఎంపీలు కంటే ఎమ్మెల్యేల మాటకే ఎక్కువ విలువినిస్తున్నారన్న భావన
* ఎమ్మెల్యేగా గెలిస్తే అదృష్టం కలిసోస్తే మంత్రి అయ్యే ఛాన్స్..!
ఈ 6 కారణాలతో మెజారిటీగా చాలామంది ఎంపీలు మళ్లీ ఎమ్మెల్యేలుగా రావాలని అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న కొందరు వైసీపీ ఎంపీల జాబితా 10టీవీ చేతికి చిక్కింది.

Bellana Chandra Sekhar (Photo : Google)
1. బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ
మంత్రి బొత్స సత్యనారాయణకు సమీప బంధువు.
చీపురుపల్లి లేదా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి.
చీపురుపల్లి, ఎచ్చెర్లలో బలమైన ఓటు బ్యాంక్
చంద్రశేఖర్ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేత
చీపురుపల్లి, ఎచ్చెర్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపు సామాజికవర్గం
ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ
బొత్స విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం
చీపురుపల్లి కాకపోతే ఎచ్చెర్ల నుంచి పోటీ
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై పార్టీలో అసంతృప్తి
కిరణ్ కు ఈసారి సీటు ఇవ్వడంపై సందేహాలు
దాంతో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసేందుకు చంద్రశేఖర్ యోచన
ఎమ్మెల్యేగా గెలిస్తే విజయనగరం జిల్లా నుంచి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే నమ్మకంలో చంద్రశేఖర్.

MVV Satyanarayana (Photo : Facebook)
2. ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ
ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు
విశాఖకు సంబంధించిన పలు సమస్యలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి
రైల్వే జోన్ అంశంలో ఒత్తిళ్లు
అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తనకు ఓటు వేయరనే భావన
ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి వరిస్తుందనే ఆశ
ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై అస్పష్టత
వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయను, దయచేసి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కు విన్నపం

Dr Beesetti Venkata Satyavathi (Photo : Google)
3. భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ
అనకాపల్లి ఎంపీగా ఉన్నారు
అనకాపల్లి ఎమ్మెల్యే కావాలనే ఆశ
కాపు లేదా గవర వర్గానికి టికెట్ ఇచ్చే ఛాన్స్
సత్యవతి గవర సామాజికవర్గానికి చెందిన వ్యక్తి
అనకాపల్లిలో గవర సామాజికవర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్
దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణలు గవర సామాజికవర్గానికి చెందిన వారే
అందుకే అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సత్యవతి ప్లాన్
అనకాపల్లి ఎమ్మెల్యేగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు
అనకాపల్లిపై అమర్నాథ్ కు అనాసక్తి
గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గం మారతారనే చర్చ బలంగా సాగుతోంది
ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీ చేసే ఛాన్స్ మిస్ చేసుకోవద్దనే ఆలోచనలో సత్యవతి
స్థానికంగా బలం పెంచుకోవచ్చనే అభిప్రాయం

Madhavi Goddeti (Photo : Facebook)
4. గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ
ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా కావాలని అనుకుంటున్న విశాఖ జిల్లాకు చెందిన మరొక నేత గొడ్డేటి మాధవి
పార్లమెంట్ పరిధి నచ్చకపోవడం
నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం
కేడర్‌కు దూరమవుతున్నామనే భావన
స్థానికుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే వత్తిడి
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచన
ఇప్పటికే పాడేరులో ఎక్కువగా తిరుగుతున్నారు

Vanga Geetha Viswanath (Photo : Google)
5. వంగా గీత, కాకినాడ ఎంపీ
ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు
ఈసారి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే భావన
పిఠాపురం సొంత నియోజకవర్గం
ఎంపీ అయ్యాక రాష్ట్ర, స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించలేకపోతున్నా అనే భావన
తన మాట చెల్లడం లేదన్న భావన
సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై అసంతృప్తి
దీన్ని క్యాష్ చేసుకోవాలని ఆశ
ఒక వేళ దొరబాబుకి టికెట్ ఇవ్వకపోతే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ హైకమాండ్ కు తెలిపారని ప్రచారం
వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్లు(జనసేన నుంచి ఆఫర్)
ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి పొందొచ్చనే అభిప్రాయం

Margani Bharat (Photo : Google)
6. మార్గాని భరత్ రామ్, రాజమండ్రి ఎంపీ
ఫస్ట్ టైమ్ ఎంపీగా విజయం
రాజమండ్రి సిటీ అసెంబ్లీ సీటుపై కన్నేసిన భరత్
ఎమ్మెల్యేగా గెలిస్తే జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశ
పార్టీలో చక్రం తిప్పొచ్చన భావన
రాజమండ్రి సిటీ.. సిట్టింగ్ టీడీపీది కావడం
వైసీపీ అధిష్టానం నుంచి టికెట్ హామీ లభించినట్లు ప్రచారం
స్థానిక రాజకీయాలు, మంత్రి పదవిపై ఆసక్తి

Sri Krishna Devarayalu Lavu (Photo : Twitter)
7. లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ
విద్యావేత్త లావు రత్తయ్య తనయుడు లావు శ్రీకృష్ణదేవరాయలు
పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత కొరవడటం
మంత్రి విడదల రజనితో విభేదాలు
ఈసారి ఎంపీగా గెలవలేననే భావన
ఈసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆలోచన
పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంపై కన్ను
ఎమ్మెల్యేగా గెలిస్తే కేబినెట్ బెర్త్ వస్తుందనే నమ్మకం

Chinta Anuradha (Photo : Facebook)
8. చింతా అనురాధ, అమలాపురం ఎంపీ
పి.గన్నవరం (ఎస్సీ రిజర్వ్డ్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్లాన్
పి.గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై అధిష్టానానికి అసంతృప్తి
అలాదే, లోకల్ గా ఉన్న మంత్రి విశ్వరూప్‌తో ఎంపీ అనురాధకు విభేదాలు
స్థానిక రాజకీయాలపై పట్టు పెంచుకునే యోచన
అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయనే భావన

Nandigam Suresh Babu (Photo : Google)
9. నందిగం సురేష్, బాపట్ల ఎంపీ
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు
తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలుపు
ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు
ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయనకు రూట్ క్లియర్
తాడికొండ(ఎస్సీ రిజర్వ్డ్) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని సస్పెన్షన్
ఈసారి ఎస్సీ కమ్యూనిటీకే చెందిన సురేష్ ను తాడికొండ నుంచి అభ్యర్థిగా నిలిపేందుకు సీఎం జగన్ ప్లాన్ చేసినట్లు ప్రచారం
ఈసారి ఎంపీగా గెలవలేననే భావన
స్థానిక రాజకీయాలపై ఆసక్తి
ఎమ్మెల్యేల సహకారం లేకపోవడం
మంత్రి పదవిపై టార్గెట్

Adala Prabhakar Reddy (Photo : Facebook)
10. ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ
నెల్లూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై సస్పెన్షన్
నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం
కోటంరెడ్డి పార్టీ వీడటం ఆదాలకు కలిసొచ్చిన అంశం
నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌చార్జ్ తనే కావడం రెండో అడ్వాంటేజ్
ఇప్పటికే 3 సార్లు గెలిచిన అనుభవం
రాష్ట్ర రాజకీయాలపై ఆదాలకు ఆసక్తి
కచ్చితంగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆదాల పోటీ

Sanjeev Kumar Singari (Photo : Facebook)
11. డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు ఎంపీ
ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్నారు
ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ప్లాన్
చేనేత సామాజికవర్గానికి చెందిన నాయకుడు
ఎమ్మిగనూరులో చేనేత(కుర్ని) సామాజికవర్గం సపోర్ట్ ఎక్కువ
90వేలకు పైగా చేనేత సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి
చేనేత సామాజికవర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్
తన సామాజికవర్గం బలంగా ఉన్న చోట ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆలోచన
నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిపై అసంతృప్తి ఒక కారణం
ఎమ్మెల్యేగా గెలిస్తే చేనేత సామాజికవర్గం నుంచి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ఆశ

Talari Rangaiah (Photo : Google)
12. తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ
కల్యాణదుర్గం లేదా గుంతకల్ అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన
కళ్యాణదుర్గం నుంచి ప్రస్తుతం ఉషా శ్రీ చరణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు
ఆమె కురబ సామాజికవర్గం నేత
హిందూపురం ఎంపీగా ఆమెను పోటీ చేయిస్తారని ప్రచారం
ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇస్తారా లేదా అన్న ప్రచారం
ప్రైవేట్ వీడియోలతో చిక్కుల్లో పడ్డ గోరంట్ల మాధవ్
వాల్మీకి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న కళ్యాణదుర్గం నుంచి పోటీకి రంగయ్య అసక్తి
కళ్యాణదుర్గం కాకపోతే వాల్మీకి సామాజికవర్గం ఓట్లు అంతే ఎక్కువగా ఉన్న గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగయ్య ప్లాన్
మంత్రి పదవి ఆసక్తి

Gurumoorthy MP Tirupati (Photo : Google)
13. డాక్టర్ గురుమూర్తి, తిరుపతి ఎంపీ
ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నారు
అనూహ్యంగా ఎంపీ టికెట్ దక్కించుకుని యంగెస్ట్ ఎంపీగా విజయం
ఈసారి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి
పార్టీ హైకమాండ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గురుమూర్తికి అవకాశం కల్పిస్తుందని ప్రచారం
గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్(మాజీ ఐఏఎస్) పట్ల తీవ్ర అసంతృప్తి
జగన్ నిర్వహించిన రెండు మూడు సర్వేల్లో వరప్రసాద్ వెనకబడి ఉన్నారని సమాచారం
గూడూరు(ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్) నుంచి గురమూర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు హైకమాండ్ ప్లాన్
అధిష్టానం నుంచి పూర్తి అండదండలు
ఈసారి మంత్రి పదవి లక్ష్యం
హైకమాండ్ ఏం చెప్పినా వింటానన్న గురుమూర్తి
ఎస్సీ కమ్యూనిటీ కావడం, ఎమ్మెల్యేగా గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశ
మరో 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి వైనాట్ 175 అని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. అటు టీడీపీ కూడా వైనాట్ 175 అంటూ సమరానికి సై అంటోంది. మరోవైపు జనసేన కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో మూడు పార్టీల మధ్య తీవ్ర రాజకీయపోరు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి సీటులో గెలుపు అనేది వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో ఈ మార్పులు చేర్పులు పార్టీకి ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా? చూడాలి.