టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : March 5, 2019 / 11:51 AM IST
టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

Updated On : March 5, 2019 / 11:51 AM IST

ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అనుచరులతో పలు దఫాలుగా చర్చించిన మోదుగుల పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తెలుగుదేశంలో తనకు అవమానేలే ఎదురవుతున్నాయని, తనకు గౌరవం లేని చోట ఉండలేనంటూ నాయకులతో మీటింగ్‌లో మోదుగుల తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది.
Also Read : మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స

ఇప్పటికే పలుమార్లు ఆయన పార్టీ మారతున్నారంటూ వార్తలు వచ్చినా ఇప్పుడు పార్టీ మారే విషయమై నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తుంది.  చివరి సారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో గ్రూపు ఫోటోలు దిగిన ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ(5 మార్చి 2019) జగన్‌తో మోదుగుల సమావేశం కానున్నట్లు తెలుస్తుండగా.. రేపు(6 మార్చి 2019) పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. 
Also Read : విమానంలో జైహింద్ అనాల్సిందే

మోదుగుల రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఆయన టీడీపీ వీడతారంటూ ప్రచారం మెుదలైంది. ఇక గత 6నెలల నుంచి అయితే అదిగో చేరిపోతున్నారు ఇదిగో చేరిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే గతంలో జరిగిన ఓ మీటింగ్‌లో తెలుగుదేశంలో రెడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ.. రాబోయే ఎన్నికల్లో రెడ్డి రాజ్యం రావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. అప్పటినుండి మోదుగుల వచ్చే ఎన్నికల టైమ్‌కి ఖచ్చితంగా పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : అది ప్రభుత్వం తప్పే.. టీఆర్‌ఎస్ ఆరు సీట్లు కూడా గెలవదు