టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గృహ నిర్బంధం : హిట్లర్ ను తలపించేలా సీఎం జగన్ వైఖరి

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 06:13 AM IST
టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గృహ నిర్బంధం : హిట్లర్ ను తలపించేలా సీఎం జగన్ వైఖరి

Updated On : January 7, 2020 / 6:13 AM IST

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్.. రాజధానిని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ వైఖరి హిట్లర్ ను తలపించేలా ఉందని విమర్శించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు టీడీపీ ఇంఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర, జనసేన నేత శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు తమ ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునివ్వడంతో  రైతుల పోరుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. హైవే దిగ్బంధంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే జాతీయ రహదారి దిగ్బంధానికి అనుమతి లేదంటున్న పోలీసులు… ఆందోళనల్లో టీడీపీ కూడా పాల్గొనటుండటంతో అలర్ట్‌ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఇవాళ్టికి 21వ రోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా మంగళవారం (జనవరి7, 2020) NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.