ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, తదితర అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈవీఎంల వినియోగాన్ని పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేకించాలని నిర్ణయించారు. అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలను వాడటం లేదని సీఎం గుర్తు చేశారు. ఈవీఎంలలో హ్యాకింగ్ కు వంద అవకాశాలున్నాయని తెలిపారు. టెక్నాలజీని ఎవరైనా దుర్వినియోగం చేయొచ్చన్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఒత్తిడి చేయాలన్నారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. హర్యానా మాజీ సీఎం హుడా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ పై సీబీఐ కేసులు, ఈడీ సోదాలు చేస్తున్నారని పేర్కొన్నారు.