ఇక్కడ గెలిస్తే ఎదురుండదు : పవర్ సెంటర్‌కు కేరాఫ్ టెక్కలి

అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికరంగా మారడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 04:13 PM IST
ఇక్కడ గెలిస్తే ఎదురుండదు : పవర్ సెంటర్‌కు కేరాఫ్ టెక్కలి

Updated On : January 21, 2019 / 4:13 PM IST

అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికరంగా మారడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది.

శ్రీకాకుళం : అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికరంగా మారడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ సమీకరణాలపై 10 TV స్పెషల్ స్టొరీ.

 

దివంగత నేత ఎర్రన్నాయుడు, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ప్రస్తుతం రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇలా హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్ధికి .. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందనే ముద్ర పడింది.

 

2014లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌పై 8380 ఓట్లు తేడాతో విజయం సాధించారు. తరువాత మంత్రి అయిన అచ్చెన్నాయుడు .. టెక్కలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో సైతం మళ్లీ అచ్చెన్నాయుడే టెక్కలి నుంచే పోటీ చేస్తున్నారు. పైగా నియోజకవర్గంలోనూ టీడీపీ శ్రేణుల్లోనూ ఈయనపై అసంతృప్తి లేకపోవడంతో పాటు ప్రత్యర్దుల బలహీనత సైతం అచ్చెన్నాయుడికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి.

 

టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌ను కాకుండా .. పేరాడ తిలక్‌ను సమన్వయకర్తగా ఫ్యాను పార్టీ బరిలో నిలిపింది. ఈ వ్యూహం వెనుక మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హస్తం ఉంది. అయితే ఈ నిర్ణయం సరైంది కాదని వైసీపీ నేతలే గుసగుసలాడుకున్నారు. కాలక్రమంలో దువ్వాడను పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేసి .. తిలక్‌కు టెక్కలి వ్యవహారాల బాధ్యత అప్పజెప్పినప్పటికీ .. మంత్రి అచ్చెన్నాయుడును ఎదుర్కునే సత్తా .. తిలక్‌కు లేదన్నది బహిరంగ రహస్యం.

 

తిలక్‌ను సమన్వయకర్తగా ప్రకటించగానే మరో నేత రొక్కం సూర్యప్రకాశరావు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో పాటుగా కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కిల్లి కృపారాణిని వైసీపీలోకి తెచ్చే అవకాశాలున్నా .. వైసీపీలో ధర్మాన వర్గం ససేమిరా అనడంతో .. సమీకరణాలు బలహీన పడ్డాయంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి అట్టాడ బాబ్జి, ఉదయ్‌లలో ఒకరిని, వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ను, జనసేన నుంచి మరో వ్యక్తిని బరిలో నిలిపే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే కాంగ్రెస్ నుంచి కృపారాణి టెక్కలి అసెంబ్లీకి పోటీ చేస్తారా, తెలంగాణ మాదిరిగా టిడిపి, కాంగ్రస్ పొత్తు ఉంటే.. కృపారాణి శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్ధుల ప్రకటన, పొత్తులు తరువాతే ఒక క్లారిటీ వచ్చే వీలుంది.

 

మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా మారిన ఈ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్ధుల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు సరైన వ్యూహంతో ముందుకువెళ్ళక పోవడం .. అచ్చెన్నాయుడుకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.