Hema Malini interesting comments: ‘ఎంపీగా కంగనా రనౌత్ పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

హేమ మాలిని స్పందిస్తూ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు. ‘‘మంచిది.. చాలా మంచిది. దీనిపై నా అభిప్రాయం అడిగితే నేను ఏం చెప్పగలను? శ్రీ కృష్ణుడు ఏది కావాలని అనుకుంటే అదే జరుగుతుంది. మథుర నుంచి సినీ తారలే పోటీ చేయాలని భావిస్తున్నారా? నేను కాకుండా మరొకరు మథుర ఎంపీ కావాలని అనుకుంటే వారు ఎంపీ అవ్వడానికి వీల్లేదని మీరు అంటారు. ఎందుకంటే మథుర నుంచి సినీ తారలే ఎంపీగా ఉండాలని మీరు భావిస్తున్నారు. ఇలాగైతే, రేపు రాఖీ సావంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు’’ అని చెప్పారు.

Hema Malini interesting comments: ‘ఎంపీగా కంగనా రనౌత్ పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

Hema Malini interesting comments

Updated On : September 24, 2022 / 7:03 PM IST

Hema Malini interesting comments: మథుర ఎంపీ, బీజేపీ నాయకురాలు, సినీ నటి హేమ మాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో హేమ మాలిని పర్యటిస్తున్న నేపథ్యంలో మీడియా ఆమెను ఓ ప్రశ్న అడిగింది. తదుపరి ఎన్నికల్లో మథుర నుంచి హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి కదా? అని ఆమెను మీడియా ప్రశ్నించింది.

దీనికి హేమ మాలిని స్పందిస్తూ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు. ‘‘మంచిది.. చాలా మంచిది. దీనిపై నా అభిప్రాయం అడిగితే నేను ఏం చెప్పగలను? శ్రీ కృష్ణుడు ఏది కావాలని అనుకుంటే అదే జరుగుతుంది. మథుర నుంచి సినీ తారలే పోటీ చేయాలని భావిస్తున్నారా? నేను కాకుండా మరొకరు మథుర ఎంపీ కావాలని అనుకుంటే వారు ఎంపీ అవ్వడానికి వీల్లేదని మీరు అంటారు. ఎందుకంటే మథుర నుంచి సినీ తారలే ఎంపీగా ఉండాలని మీరు భావిస్తున్నారు. ఇలాగైతే, రేపు రాఖీ సావంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు’’ అని చెప్పారు.

రాజకీయాలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పడానికి ఒప్పుకోలేదు. కాగా, చాలా కాలంగా కంగనా రనౌత్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Hyderabad T20 Match: శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు.. భారీగా తరలివెళ్లిన ఫ్యాన్స్