Maharashtra Politics: అజిత్ పవార్‭ను కలిసి సంతోషం వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు

Maharashtra Politics: అజిత్ పవార్‭ను కలిసి సంతోషం వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray and Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాలు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతన్నాయి. కొద్ది రోజుల క్రితం శరద్ పవార్ మీద తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ బృందం ఉన్నట్టుండి.. శరద్ పవార్‭ను కలుసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‭ను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కలుసుకున్నారు. అంతే కాదు, ఆయన పని పట్ల సంతోషం కూడా వ్యక్తం చేశారు. తనమీద తిరుగుబాటు చేసిన బృందంతోనే అజిత్ పవార్ చేతులు కలిపారు. పైగా తన మిత్ర పక్షం మీదే అజిత్ పవార్ చేతులు కలిపారు.

INDIA: కులతత్వ పార్టీలతో కాంగ్రెస్ కూటమి.. ఇండియా కూటమిపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన వ్యాఖ్యలు

ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. ఇక ఉద్ధవ్ థాకరేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య థాకరే సహా మరికొంత మంది శివసేన (యూబీటీ) నేతలు కూడా ఉన్నారు.

Seema and Sachin: భారత్‭లో ఎంటర్ అయ్యేందుకు సీమా హైదర్ పెద్ద స్కెచ్చే వేసిందిగా.. వెలుగులోకి వస్తున్న షాకింగ్ కోణాలు

కాగా, అజిత్ పవార్‭ను కలిసి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి సేవలందించాలని కోరినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరే తెలిపారు. తామిద్దరం గత క్యాబినెట్‌లో కలిసి పనిచేశామని, అజిత్ పవార్ పనితీరు తనకు బాగా తెలుసునని ఉద్ధవ్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఖజానా తాళాలు ఆయన వద్దే ఉన్నందున రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో థాకరే ముఖ్యమంత్రిగా, ఆయనకు డిప్యూటీ (ఉప ముఖ్యమంత్రి)గా అజిత్ పవార్ పనిచేశారు.