జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

  • Published By: chvmurthy ,Published On : February 8, 2019 / 12:59 PM IST
జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

Updated On : February 8, 2019 / 12:59 PM IST

విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం  కానున్నారు.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్  హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇప్పటికే వైసీపీ ఈఅంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.  కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్లింది.  రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి కూడా ఈ ఓటర్ల లిస్టుపై  వైసీపీ ఫిర్యాదు చేసింది.

దీనికి తోడు గత వారంరోజులుగా రాష్ట్రంలో అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులను, వారికి అనుకూలమైన ప్రదేశాలకు బదిలీ చేస్తున్నారని కూడా జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు.