వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది- ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు
షర్మళను ఐదేళ్లు పీసీసీ అధ్యక్షురాలిగా ఉంచితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2029లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది.

Anam RamaNarayana Reddy On Sharmila
Anam RamaNarayana Reddy : రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ తమపై అనర్హత వేటు వేసిందన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. నాలుగు వారాల గడువు అడిగినా ఇవ్వలేదన్నారు. అయినా చట్టసభలపై గౌరవంతో విచారణకు వచ్చామన్నారు. తమపై వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగినా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీలు సమాధానం చెప్పలేదన్నారు. వైసీపీ తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక తాము రాజకీయంగా స్వేచ్చా జీవులం అయ్యామని వ్యాఖ్యానించారు.
మాపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయం నుంచి ఫోన్ లో డైరెక్షన్స్ ఇస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లే స్పీకర్ తమ్మినేని సీతారాం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ
”స్పీకర్ పర్సనల్ హియరింగ్ కు రమ్మని లేఖ పంపారు. ముందు రెండు లేఖలు పంపించారు. యాంటీ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొన్నామని పిటిషన్ వచ్చిందని విచారణలో తెలిపారు. మాపై ఫిర్యాదు చేసిన పిటిషనర్ ఈ విచారణలో లేకుండా వెళ్లిపోతే ఎలా? ఇది చట్టబద్దం, న్యాయబద్దం కాదని స్పీకర్ కు చెప్పాము. ముందుగా ఆయన కంప్లైంట్ ఇచ్చి వెళ్లారని ఆయన విచారణలో ఉండాలని రూల్ లేదన్నారు. మాపై ఆరోపణలపై వార్తల జిరాక్స్ ఇచ్చారు. చట్టబద్దంగా ఇవి చెల్లవని, పత్రికల వారు అథెన్సిసిటీ ఇచ్చారా? అని అడిగాం.
మీరు పంపిన సీడీ ఓపెన్ కాలేదు. కాబట్టి ఒరిజినల్ విజువల్ కావాలని అడిగాం. ఆ వార్తలు ఇచ్చిన వారిని అడిగారా అని కూడా అడిగాం. అవసరం లేదన్నారు. న్యాయవాదులను తెచ్చుకుంటామని పర్మిషన్ అడిగాను. న్యాయవాదిని తెచ్చుకునేంత సమయం లేదని స్పీకర్ చెప్పారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి లెటర్ ఇచ్చాం. కుదరదు అన్నారు. మెమో అందినట్లు అక్నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వం అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని వాదించాం. సెక్రెటరీ జనరల్ ను అక్నాలెడ్జ్ మెంట్ రాజ్యసభలో ఇవ్వరా? అని అడిగాం. రిసీవ్డ్ కాపీ అని ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించాం. చివరకు ఇస్తామని హామీ ఇచ్చారు. స్పీడ్ పోస్ట్ లో అయినా పంపించండి అని అడిగాం.
Also Read : అంతవరకు పుట్టింటి నుంచి కదలను.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి..
స్పీకర్ పంపించమని అధికారులకు చెప్పారు. ఎన్నో ప్రెసిడెన్సస్ ఉన్నాయి. ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. వాటిని పరిశీలించమని కోరాం. తర్వాత నిర్ణయం తీసుకోమన్నాం. నేను నిర్ణయం తీసుకున్నాను. రాబోవు తరాలకు నా నిర్ణయం మార్గం అవుతుందని స్పీకర్ అన్నారు. నిబంధలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే రాబోవు తరాలు తిట్టుకుంటాయని స్పీకర్ తో అన్నాను. నీకు టికెట్ ఇవ్వరు. మా నాయకుడు మాకు హామీ ఇచ్చారు. చివరి నిర్ణయం మంచిగా తీసుకోండి అని స్పీకర్ తమ్మినేనికి సలహా ఇచ్చాను” అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
షర్మిల దూకుడుగా వెళ్తోంది..
ఇక, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం జగన్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలపైనా ఆనం రామనారాయణెడ్డి స్పందించారు. ”షర్మిల దూకుడుగా వెళ్తోంది. జగన్ పై చేస్తున్న ఆరోపణలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. షర్మిలను ఐదేళ్లు పీసీసీ అధ్యక్షురాలిగా ఉంచితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2029లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును, ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మరిచిపోలేదు అని” ఆనం రామనారాయరెడ్డి అన్నారు.