జగన్ ట్వీట్: చంద్రబాబు బీసీ రైతును చంపేశారు

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 08:31 AM IST
జగన్ ట్వీట్: చంద్రబాబు బీసీ రైతును చంపేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబు తన సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపారంటూ తన ట్విటర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు జగన్. కొండవీడులో బీసీ రైతు కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గారు. మీ హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్‌ దెబ్బలకు రైతు నేలకొరిగాడంటూ విమర్శించారు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేసి.. మానవత్వం చూపాల్సిన సందర్భంలో రాక్షసత్వం ఏమిటీ చంద్రబాబు గారూ? అని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
    

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చంద్రబాబు హెలికాఫ్టర్ దింపేందుకు పూలు.. పండ్ల తోటను నాశనం చేశారని, పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్‌ దెబ్బలకు రైతు నేలకొరగి అనంతరం చనిపోయాడు. కోటయ్య చనిపోయిన 20 గంటల తర్వాత ఏపీ పోలీసులు స్పందించారు. కాగా రైతు కోటయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.