పవన్ ని జోకర్ గా చూస్తున్నారు : భవిష్యత్తులో టీడీపీ ఉండదు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : September 15, 2019 / 08:22 AM IST
పవన్ ని జోకర్ గా చూస్తున్నారు : భవిష్యత్తులో టీడీపీ ఉండదు

Updated On : September 15, 2019 / 8:22 AM IST

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు. పవన్ నిలకడ, అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. పవన్ తనని తాను అవమానించుకుంటున్నారని అన్నారు. జగన్ 100 రోజుల పాలనపై పవన్ చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పవన్ ఇంకా చంద్రబాబు పార్టనర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేరిక వైసీపీకి శుభపరిణామం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జగన్ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలకు మంచి చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు చేసిన పనులకు రూ.700 కోట్ల నష్టం జరిగిందన్నారు. చరిత్రలోంచి టీడీపీ కనుమరుగు అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. సత్యపాలన జగన్ తోనే సాధ్యం అని ఆమంచి అన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా ప్రజలు జగన్ వైపు నిలబడ్డారని చెప్పారు. జగన్ పాలనపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆమంచి ఖండించారు. ఇంకా ఎందరో నేతలు వైపీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. పవన్ ని అసలు రాజకీయ నేతగానే ప్రజలు గుర్తించడం లేదని ఉదయభాను అన్నారు. పవన్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఏ విషయంపైనా అవగాహన లేని వ్యక్తి పవన్ అని విమర్శలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసమే వైసీపీలోకి వచ్చానని తోట త్రిమూర్తులు చెప్పారు. జగన్ పై నమ్మకంతో వైసీపీలో చేరానని అన్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీ నేతలందరితో కలిసి పని చేస్తానని తెలిపారు. తోట త్రిమూర్తులును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. త్రిమూర్తులును పార్టీలో చేర్చుకోవడం వెనుక జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తోట త్రిమూర్తులు రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.