జగనన్న వదలమని చెప్పినా వినను- ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

నేను నరసరావుపేటలో ఉన్నా.. నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తోలు వలిచేస్తా. కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే.. ముందు నన్ను దాటి వెళ్ళాలి.

జగనన్న వదలమని చెప్పినా వినను- ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

Anil Kumar Yadav Mass Warning

Updated On : February 24, 2024 / 12:43 AM IST

Anil Kumar Yadav : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. అభ్యర్థులను మార్చేది చెప్పలేదని పార్టీని వీడటం సరికాదన్నారు. మైనార్టీకి అవకాశం ఇస్తే అది నచ్చకే పార్టీని వదిలి వెళ్లారని ఎంపీ వేమిరెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే అనిల్. వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్ధిగా సామాన్యులకు జగన్ అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. పార్టీలో జగనన్న నిర్ణయమే ఫైనల్ అని, పార్టీ నిర్ణయం ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు.

అభ్యర్థులను నిర్ణయించేది సీఎం జగన్ ఇష్టం అని.. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయన సర్వేలు ఆయనకు ఉన్నాయని తెలిపారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకునే సీఎం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్.

వైసీపీలో పదవులు అనుభవించి వైసీపీకి మోసం చేయాలనుకున్న నాయకులను ఎవరినీ వదలను అని అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగనన్న వదలమని చెప్పినా వినను అని ఆయన అన్నారు. జగన్ ను మోసం చేసిన ఇలాంటి నాయకులు చంద్రబాబుకు కూడా పంగనామాలు పెట్టడం గ్యారంటీ అన్నారు. పార్టీలోకి రావాలని వైసీపీ నేతలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని అనిల్ ఆరోపించారు. నేను నరసరావుపేటలో ఉన్నా.. నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తోలు వలిచేస్తా అని హెచ్చరించారు. కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే.. ముందు నన్ను దాటి వెళ్ళాలి అని అనిల్ అన్నారు.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది