వైసీపీ అభ్యర్థుల ధర్డ్ లిస్ట్.. జిల్లాల వారీగా మార్పులు చేర్పులు ఇవే
ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్.

YSRCP Third List
YSRCP Third List : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇంఛార్జిలను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంఛార్జిల మార్పుపై రెండు జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్.. ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది. మూడో జాబితాలో మొత్తం 21 మంది ఉన్నారు. ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్. కాగా, నిన్ననే సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇంఛార్జిగా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని ఇంకా వైసీపీ కండువా కూడా కప్పుపుకోలేదు. అయినప్పటికీ వైసీపీ ఆయనను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం విశేషం.
ఇక జిల్లాల వారిగా చూస్తే..
శ్రీకాకుళం జిల్లా:
జెడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ నియమిస్తూ వైసీపీ నిర్ణయం.
కడప జిల్లా:
రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి.
సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి ఈసారి టికెట్ కేటాయించని సీఎం జగన్.
ఏలూరు:
ఏలూరు లోక్‌సభ వైసీసీ అభ్యర్థిగా కారుమూరి సునీల్
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్
జగన్ కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తి కూతురిని ప్రేమ వివాహం చేసుకున్న సునీల్
తణుకు నియోజకవర్గంలో తండ్రితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సునీల్
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
కర్నూలు:
జిల్లాలో 3 స్థానాల్లో మార్పులు
ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరిని కర్నూలూ ఎంపీ అభ్యర్థిగా పంపిన అధిష్టానం
గుమ్మనూరు స్థానంలో చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షిని ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు మొండిచేయి
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అభ్యర్థిగా ప్రకటన
శ్రీకాకుళం జిల్లా:
3వ లిస్టులో కలింగ సామాజికవర్గానికి ప్రాధాన్యతనిచ్చిన వైసీపీ హైకమాండ్.
ప్రకటించిన అభ్యర్దులంతా కలింగ సామాజికవర్గం వారే.
ఇచ్చాపురం- మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ ఇంఛార్జ్ గా ఉండగా జెడ్పీ చైర్మన్ పిరియ విజయ (సాయిరాజ్ భార్య)కు సీటు కేటాయింపు.
టెక్కలిలో మరోసారి ఇంఛార్జ్ మార్పు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి భార్య దువ్వాడ వాణిని కొద్దిరోజుల క్రితం నియమించిన అధిష్టానం. తిరిగి దువ్వాడ శ్రీనివాస్ కి సీటు కేటాయింపు. అచ్చెన్నాయుడుని ఢీకొట్టేందుకు దూకుడుగా ఉండే దువ్వాడ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చిన వైసీపీ.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్..
తిలక్ గతంలో టెక్కలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమిపాలయ్యారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?
* ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి పార్లమెంటు(కర్నూలు) నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు జగన్.
* మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటు ఇంఛార్జిగా ప్రకటించారు.
* తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్ సభ అవకాశం లేనట్టే. తిరుపతి ఎంపీ స్థానం ఇంఛార్జిగా కోనేటి ఆదిమూలం.
* ఏలూరు ఎంపీ స్థానం ఇంఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను నియమించారు.
* శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇంఛార్జిగా పేరాడ తిలక్.
ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే.. మూడో జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా, మూతిరేవుల సునీల్ కుమార్ ను ఇంఛార్జిగా నియమించారు. ఈసారి తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఇటీవలే ఎంఎస్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇంఛార్జిలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారాయన.
ఇక, మంత్రి జోగి రమేశ్ కు స్థాన చలనం కలిగింది. ఆయనను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు.