గుడ్ న్యూస్ : కరోనాకు మందు Favipiravir..RLS ఘనత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు మందు ఎప్పుడొస్తుంది ? దీని బారి నుంచి పడేదెప్పుడూ ? అని ప్రజలు ఆలోచిస్తున్నారు. వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి జరుపుతూనే ఉన్నారు. ఇందులో భారతదేశానికి చెందిన సైంటిస్టులు కూడా ఉన్నారు. పలు కంపెనీలు మెడిసిన్ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. వీటి సరసన హైదరాబాద్ కు చెందిన రాఘవ లైఫ్ సైన్సెస్ (RLS) చేరింది.
తాము కరోనాను నియంత్రించే దిశగా అనేక ప్రయోగాలు చేసి రూపొందించిన ‘ఫావిపిరావిర్’ అనే మందును అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. జపాన్ లో కరోనా పాజిటివ్ రోగుల చికిత్స కోసం వినియోగిస్తుండగా, చైనా, టర్కీ తదితర దేశాల అధ్యయనాల్లో ఈ మందు మంచి సత్ఫలితాలు ఇస్తోందని వెల్లడించింది. రష్యా దేశంలో నిర్వహించిన..క్లినికల్ ట్రయల్స్ లో 90 మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా..రోగి కొలుకొనే సమయం 11 రోజుల నుంచి 4 రోజులకు తగ్గిందని, రికవరీ రేటు సైతం 55.86 శాతం నుంచి 71.43 శాతానికి పెరిగిందని RLS తెలిపింది.
ఇదిలా ఉంటే…కేవలం భారతదేశంలో లభించే ముడి పదార్థాలతోనే పావిపిరవిర్ టాబ్లెట్ రూపొందించినట్లు, ఇతర ఏ ఒక్క దేశంపై ఆధార పడే పరిస్థితి లేకుండా చేశామని వెల్లడించింది. భారత ఫార్మాస్యుటికల్ రంగం సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చని RLS కంపెనీ డైరెక్టర్ లోహిత్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి సాధ్యమైందని, ఫలితాలు కూడా మెరుగ్గానే ఉన్నాయన్నారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే…అభివృద్ధి చెందుతున్న ఇండియాతో పాటు అనేక పేద దేశాలకు గొప్ప మేలు జరుగుతుందన్నారు.