Adrustam : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున నిద్రించాలి?

ఏ దిక్కున తల చేయాలి, ఏ దిశలో కాళ్లు పెట్టాలి? ఎలా నిద్రపోతే మనకు అంతా మంచే జరుగుతుంది?

Adrustam : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున నిద్రించాలి?

Updated On : January 24, 2025 / 12:56 AM IST

Adrustam : ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఇంట్లో ఏ దిక్కున పడితే ఆ దిక్కున నిద్రపోకూడదా? అలా చేస్తే ఇబ్బందులు తప్పవా? అంటే అవుననే అంటున్నారు వాస్తు పండితులు. ఇంట్లో నిద్రపోవడానికి కూడా దిక్కులు ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ.. ఇంట్లో ఏ దిక్కున నిద్రపోవాలి? ఏ దిక్కున తల చేయాలి, ఏ దిశలో కాళ్లు పెట్టాలి? ఎలా నిద్రపోతే మనకు అంతా మంచే జరుగుతుంది? ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి మాటల్లో తెలుసుకుందాం..

డబ్బు ఉన్నా లేకపోయినా ముందు మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రశాంతం అన్నది లేకపోతే నిద్ర రాదు. ప్రశాంతత ఉండాలంటే లక్ష్మిదేవి స్థిరంగా ఉండాలి. ఏ రాశి వారైనా సరే.. తూర్పున కాళ్లు పెట్టి, పడమర తలాపు పెట్టి పడుకున్నట్లైతే.. సూర్యోదయం వరకు పడుకోకూడదు. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. అలా చేస్తే ఆ ఇంటికి శుభప్రదంగా ఉంటుంది. వారికి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

స్త్రీలు దక్షిణాన తల, ఉత్తరాన కాళ్లు పెట్టి పడుకుంటే మంచిది. నిద్ర లేవగానే ఉత్తరం ముఖంగా లేస్తాం. ఉత్తరం ముఖంగా చూడటం అంటే.. లక్ష్మిదేవిని దర్శించుకున్నట్లే. తర్వాత తూర్పుకి తిరుగుతాం. లేవడం ఉత్తర ముఖంగా లేచి, దిగడం తూర్పుగా వెళ్లిపోతాం. దాని వల్ల చక్కని నిద్ర పడుతుంది. మనం అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. చెడు కలలు రావు. మనశ్శాంతిగా ఉంటారు.

Also Read : వాస్తు ప్రకారం ఇంట్లో వాష్ రూమ్స్ ఏ దిక్కున ఉండాలి?

అదే ఉత్తరం తల చేసి, దక్షిణం కాళ్లు పెట్టి.. నిద్ర లేవగానే దక్షిణం ముఖం చూస్తారు. అలాంటి వారికి దిన దిన గండమే. నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణ నష్టం అవకాశం కూడా ఉంది. ఆయుష్షు లోపం ఉన్నట్లైతే మరింత తొందరగా జరిగిపోతుంది. ఉత్తరం తల పెట్టి దక్షిణం ముఖంగా లేవకూడదు.

తూర్పు తల పెట్టి, పడమర ముఖంగా లేవడం.. ఇది అత్తగారి ఇంట్లో ఇలా చేయాలి. మన ఇంట్లో మనం అలా చేయకూడదు. అత్తగారి ఇంటికి అల్లుడు వెళ్లినప్పుడు.. తూర్పు తల పెట్టి, పడమర కాలు పెట్టి నిద్రపోతే.. అత్తగారికి కలిసి వస్తుంది. వాళ్లు బాగుంటారు. అల్లుడికి కూడా గౌరవం ఉంటుంది. లక్ష్మిదేవి సాక్ష్యాత్తు వచ్చి మన ఇంట్లో నిద్ర చేసి వెళ్లినట్లే. విశేషంగా కలిసి వస్తుంది” అని ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.

ఇంట్లో ఈ దిశలో డబ్బు దాచితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట..
”లక్ష్మీదేవి, కుబేర స్థానం, గురు స్థానం.. ఈ మూడూ కలగలిపిన స్థానమే ఉత్తర భాగం. అది స్థిర స్థానం. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆమె ఉండాల్సిన స్థానంలో మనం దాచుకోగలిగితే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరపడుతుంది. ఆ ఇంట్లో నిత్యం ధనం ఉంటుంది. ఒకవేళ వెళ్లిపోయినా మళ్లీ వస్తుంది.

పడమర, దక్షిణం, తూర్పు ఆగ్నేయం.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడితే మనం లక్ష్మీదేవిని ఒక చోట స్థిరంగా ఉంచడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తిప్పుతూ ఉండటం వల్ల లక్ష్మి దేవత ఆ ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎవరికైనా లక్ష్మి దేవి అనుగ్రహం కావాలి. వాస్తు ప్రకారంగా ఏ రాశి వారు అయినా, ఏ నక్షత్ర జాతకులైనా ధనాన్ని ఉత్తర భాగంలో దాచడం మంచిది” అని ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు.

Also Read : ఇంట్లో ఈ యంత్రం ఉంచారంటే ఆర్థికంగా ధనవంతులు అవుతారట..!