తిరుమల లడ్డూ వివాదం ప్రభావం..! అయోధ్యలో ప్రసాదం మారబోతుందా?
తిరుమల ఆలయంలో అపచారం అంటే ప్రపంచంలోని అన్ని గుడులలో తప్పు జరిగినట్లేనని భక్తులు ఫీల్ అవుతున్నారు.

Tirumala Laddu Impact On Ayodhya Ram Mandir Prasad (Photo Credit : Google)
Ttd Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చకు కారణం అవుతోంది. లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో ఆయోధ్య రామ మందిరం నిర్వాహాకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడేం ఏం జరగబోతోంది? అయోధ్యలో ప్రసాదం మారబోతుందా? అయోధ్య ప్రసాదం వ్యవహారంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి.
Also Read : జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
తిరుమల ఆలయంలో అపచారం అంటే ప్రపంచంలోని అన్ని గుడులలో తప్పు జరిగినట్లేనని భక్తులు ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. దాంతో ఆలయ కమిటీలు అలర్ట్ అయ్యాయి. ప్రసాదంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఇంతకీ ఏ ఆలయంలో ఎలాంటి మార్పు ఉండబోతుంది? తెలంగాణలో తిరుపతి లడ్డూ ఎఫెక్ట్ ఎలా ఉంది?
తిరుమల లడ్డూ వివాదం ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్ లోని ఆలయాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో యూపీలోని ఆలయ కమిటీలు అలర్ట్ అయ్యాయి. అయోధ్య, ప్రయాగ్ రాజ్, మధురలోని పెద్ద దేవాలయాల ప్రసాదం నియమాల్లో మార్పులు చేస్తున్నారు. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్.. బయటి ఏజెన్సీలు చేసిన ప్రసాదాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇక పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు తయారు చేయాలని మధురలోని ధర్మ రక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. అంటే, స్వీట్లకు బదులు పండ్లు, పూలు, ఇతర సహజ సిద్ధమైన పదార్దాలతో చేసిన ప్రసాదాన్ని చేర్చనున్నారు. స్వచ్చమైన స్వాతిక ప్రసాదంతో పాటు సాంప్రదాయ పద్ధతులను తిరిగి తీసుకురావాలని మత పెద్దలు, కొన్ని సంస్థలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
పూర్తి వివరాలు..