Art Director Anand Sai : విశ్వకర్మలకు పని చేయడమే తెలుసు, మార్కెటింగ్ చేసుకోవడం రాదు- ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

మేము దేనికీ దిగము. మాకు వస్తే మేము చేస్తాం. లేదంటే లేదు. విశ్వకర్మలకు కావాల్సిన ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలి.

Art Director Anand Sai : విశ్వకర్మలకు పని చేయడమే తెలుసు, మార్కెటింగ్ చేసుకోవడం రాదు- ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

Updated On : February 8, 2025 / 8:59 PM IST

Art Director Anand Sai : విశ్వకర్మలకు అపారమైన ప్రతిభ ఉన్నా వారికి సరైన గుర్తింపు దక్కడం లేదా? వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందడం లేదా? విశ్మకర్మలకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటి? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఏమన్నారంటే..

”విశ్వకర్మల్లో ఔట్ స్టాండింగ్ ఆర్ట్ ఉంది. కానీ, వారికి సరైన ప్రవేశం లేదు. వాళ్లు ఎంత హార్డ్ వర్క్ చేసినా.. అంత ప్రతిఫలం దక్కడం లేదు. విశ్వకర్మలకు మార్కెటింగ్ గురించి తెలీదు. మార్కెట్ చేసుకోవడం ఎలాగో తెలీదు. యాదాద్రి డిజైన్ చేసిన తర్వాత మరో పది ఆలయాలు నేను చేసుకోవచ్చు. నేను మార్కెట్ చేసుకోవచ్చు. కానీ, నేనలా చేయలేదు.

పిఠాపురంలో ఒక ఇన్ స్టిట్యూషన్ ప్లాన్ చేద్దామని పవన్ కల్యాణ్ చెప్పారు..
మేము దేనికీ దిగము. మాకు వస్తే మేము చేస్తాం. లేదంటే లేదు. విశ్వకర్మలకు కావాల్సిన ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలి. టెంపుల్ ఇన్ స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. తిరుమల, మహాబలిపురంలో ఉంది. తెలంగాణలో లేదు. పిఠాపురంలో ఒక ఇన్ స్టిట్యూషన్ ప్లాన్ చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. దేవుని దయతో అన్నీ అనుకూలిస్తే అది సాధ్యం అవుతుంది” అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అన్నారు.

అన్నీ యాదాద్రిలాగానే మనం చేయలేము..
”కేసీఆర్ ఉన్నప్పుడు వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర.. ఈ టెంపుల్స్ అన్నింటికి నేను డిజైన్ చేశాను. ముందుగా భద్రాచలం వెళ్లాలని అనుకున్నాం. అప్పుడు నేను, చిన్నజీయర్ స్వామి భద్రాచలం వెళ్లి ప్లానింగ్ చేశాం. కంప్లీట్ డిజైన్ అయిపోయింది. భద్రాచలంలో వెయ్యి కాళ్ల మండపం చేద్దామని అనుకున్నాం. దాని తర్వాత కొండగట్టు చేద్దామనుకుం. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది.

టెంపుల్ డెవలప్ చేయాలంటే ముందుగా చుట్టుపక్కల ఉన్న భూములను తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి. అన్నీ యాదాద్రిలాగానే మనం చేయలేము. మౌలిక సదుపాయాలు కల్పించాకే టెంపుల్ డెవలప్ చేస్తే బాగుంటుంది” అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అన్నారు.