Badrinath : ఉత్తరాఖండ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక, నిలిపేసిన బద్రీనాథ్ యాత్ర!
ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Uttarakhand
Badrinath Halted : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రం ఇప్పటికే అతలాకుతమమవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు పడుతుండడంతో..కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలువురు మృతి చెందారు. తాజాగా…ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు ఎక్కడకు వెళ్లవద్దని, ఏదైనా ప్రయాణాలు ఉంటే…వాయిదా వేసుకోవాలన్నారు.
Read More : Kerala : అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి
చమోలీ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోంటోంది. అందులో భాగంగా…బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. యాత్రీకులంతా…బద్రీనాథ్ యాత్రకు రావొద్దని..ఇప్పటికే వచ్చిన పర్యాటకులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల వద్ద ఉండాలని చమోలీ జిల్లా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా విజ్ఞప్తి చేశారు. 2021, అక్టోబర్ 18వ తేదీ సోమవారం స్థానికంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ సంవత్సరం చమోలీ జిల్లాలో అకస్మిక వరదలు పోటెత్తాడంతో…హిమానీ నది నుంచి భారీగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ధౌలిగంగాలో పడడంతో భారీ సంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు.
Read More : AP : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!
ఇదిలా ఉంటే…కేరళ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా…దాదాపు 11 మంది మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం కురిసిన భారీ వర్షాలకు రహదారులు కొట్టుకపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరదలు ఇంకా కొనసాగుతుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలు పడుతున్నాయి కనుక రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.