Kerala : అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి

కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది.

Kerala : అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి

Kerala

Updated On : October 17, 2021 / 6:32 PM IST

Sabarimala Temple : కేరళ రాష్ట్రంలోని ప్రముఖమైన ఆలయంగా పేరొందిన అయ్యప్ప టెంపుల్ తెరుచుకుంది. తులామాసం సందర్భంగా శనివారం నుంచి ఆలయాన్ని తెరిచారు ఆలయ అధికారులు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి గురువారం వరకు స్వామి వారిని దర్శించుకొనేందుకు దేవస్థానం బోర్డు అనుమతినిచ్చింది. వర్చువల్ విధానంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతినిచ్చింది. అయితే..కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read More : Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షం..14మంది మృతి

కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. దీంతో అయ్యప్ప ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది. ఆది, సోమవారాల్లో శబరిమల ఆలయానికి రావొద్దని సూచించింది. భారీ వర్షాల కారణంగా..కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. పతనంతిట్ట జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు వస్తున్నాయి. పంబా నదిలో నీటి మట్టం ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో..ఈ దారి గుండా..వచ్చే భక్తులు పలు ఇబ్బందులకు గురవుతారని తెలిపింది.

Read More : Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షాలు….ఈరోజు, రేపు శబరిమల దర్శనాలు రద్దు

ఇడుక్కి జిల్లాలో కొక్కయార్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికారణంగా..పలువురు మృతి చెందారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. కేరళ రాష్ట్ర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, నదులు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిదని వెల్లడించింది.
ఇక అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్నట్లుగా వ్యాక్సిన్ సర్టిఫికేట్, కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. ఈనెల 21వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. మరలా నవంబర్ 02వ తేదీన అత్త చితిర పూజ కోసం తెరవనున్నారు. మరునాడే ఆలయాన్ని మూసివేస్తారు.