Yadadri Temple : ఏప్రిల్ 25న యాదాద్రిలో శివాలయం తిరిగి ప్రారంభం
తెలంగాణ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరి

yadadri siva temple
Yadadri Temple : తెలంగాణ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరిగి ప్రారంబించనున్నారు. తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసినట్టు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది.
ఏప్రిల్ 21న శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ జరిపి 25న శివాలయాన్ని పునఃప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. మరో రెండ్రోజుల్లో తొగుట పీఠాధిపతి వద్దకు వెళ్లి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐదురోజులపాటు నిర్వహించే హోమాలు, మూల మంత్రాలు, పూజల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది సెప్టెంబర్ 18న శివాలయ ధ్వజస్తంభం, కర్రలు, ఇత్తడి కలశాలు, తొడుగులకు శుద్ధి పూజలు చేశారు.
మరో వైపు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి…స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ విష్వక్సేనరాధన,స్వస్తివాచనం,రక్షబంధనం పూజలు వేదమంత్రాలు,మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు.
Also Read : Tirumala : తిరుమలలో హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయి-టీటీడీ చైర్మన్
ప్రధానాలయా పునర్నిర్మాణం పనులు జరుగుతుండటంతో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో స్వయంభూ నరసింహునికి పూజలు నిర్వహించి స్వామి వారి అనుమతితో బాలాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు.