Gokulashtami 2021 : తిరుపతి, శ్రీశైంలో ‘గోకులాష్టమి’ వేడుకలు
తిరుపతి, శ్రీశైలంలో గోకులాష్టమి సందర్భగా గోపూజ కార్యక్రమాలు జరిగాయి. గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు.

Iskan Temple
Tirupati And Srisailam : తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో ‘గోకులాష్టమి’ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుపతి, శ్రీశైలంలో గోకులాష్టమి సందర్భగా గోపూజ కార్యక్రమాలు జరిగాయి.. టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు. గోశాలలోని వేణుగోపాల స్వామి వారిని టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.
Read More : Janmashtami : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ ఫ్రైజ్, ‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్
గోమాత, దూడకు అర్చకులు మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి పూజలు చేశారు. గోమాత చుట్టూ ప్రదిక్షణలు చేసిన ఛైర్మన్, ఈవో హారతి ఇచ్చారు. అనంతరం గోమాత పాలు పితికి…అర్చకులకు అందించి అభిషేకం చేయించారు. వెంకటేశవర పుస్తక జప సమర్పణ పుస్తకంలో ఓం నమో వెంకటేశాయ అని రాశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read More : Sravana Masam : శ్రావణ మాసం విశిష్టమైనది ఎందుకంటే….
ఇక శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాకారంలో శ్రీ గోకులం వద్ద 11 గోవులకు, 11 లేగదూడలకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న పూజలు చేశారు. శ్రీ సూక్త సహిత గో అష్టోత్తర షోడశోపచార పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
Read More : శ్రావణమాసం పరమ పవిత్రం : నిత్యం విశేషాలే
దేశ ప్రజలందరూ అర్చక స్వాములు మహా సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ..గో మాతను పూజిస్తే..దేవతలందరినీ పూజించిన ఫలితం కలుగుతుందని, దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో..సుమారు 1150 గోవులు సంరక్షింపబడుతున్నాయని తెలిపారు. గోవులను ప్రతొక్కరూ కాపాడాలని, గో సంరక్షణకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.