Makara Jyothi Darshanam : మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్తజనం

అయ్యప్పస్వామి భక్తులకు పరమ పవిత్ర మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకించారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగింది.

Makara Jyothi Darshanam : మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్తజనం

Updated On : January 14, 2023 / 9:09 PM IST

Makara Jyothi Darshanam : అయ్యప్పస్వామి భక్తులకు పరమ పవిత్ర మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకించారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగింది.

ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి మూడు సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పొన్నంబలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకరవిళక్కును దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.

మకర సంక్రాంతి సందర్భంగా పొన్నgబలంమేడు పర్వత శిఖరాలపై మకర జ్యోతిని దర్శంచుకుని భక్తులు పులకించారు. అంతకుముందు పందాళం నుంచి తీసుకొచ్చిన తిరువాభరణాలను అర్చకులు అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి ఇచ్చారు. మకర జ్యోతి దర్శనం కోసం కేరళతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా శబరిమల వచ్చారు.