Medaram : తెలంగాణలో కుంభమేళ.. మేడారంలో మండమెలిగె పండుగ

మండమెలిగె పండుగ రోజు కన్నెపల్లి, మేడారం గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాల్లో కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో

Medaram : తెలంగాణలో కుంభమేళ.. మేడారంలో మండమెలిగె పండుగ

Updated On : February 9, 2022 / 7:04 AM IST

Medaram Jatara 2022 : తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద జాతరకు సిద్ధమౌతోంది. సమ్మక్క – సారలమ్మ మహా జాతర కోసం మేడారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకార్ం చుడుతారు. వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర ప్రారంభం అవుతుంది. అయితే.. మహాజాతరకు వారం రోజుల ముందు జరిగే పూజా కార్యక్రమాలకు మండమెలిగె పేరిట పండుగ నిర్వహిస్తారు. ఇది ప్రారంభం అయితే..మహాజాతర మొదలట్లేనని ఆదివాసీలు భావిస్తారు.

Read More : Writing With Fire: భారత్ నుంచి ఆస్కార్‌కు ఒక్కటే.. “రైటింగ్ విత్ ఫైర్”!

ఈనెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే జాతరకు ప్రారంభ సూచికగా పూజారులు మండమెలిగె పండుగను నిర్వహించనున్నారు. దీంతో సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ వెలిసిన కన్నెపల్లి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పూర్వం వనదేవతలకు వేర్వేరుగా గడ్డి గుడిసెలలో పూజా మందిరాలు ఉండేవి. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు ముందు వాటిని తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టేవారు. జాతరకు మూడు వారాల ముందు మొదటి బుధవారం గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పాత గుళ్లను తొలగించేవారు. రెండో బుధవారం నూతన గుళ్ల నిర్మాణాన్ని చేపట్టేవారు. దీనినే మండమెలిగె పండుగగా పూజారులు పిలుచుకుంటారు.

Read More : Telangana TRS : మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్.. నల్లజెండాలతో నిరసన..

గతంలో నిర్వహించిన సంప్రదాయం ప్రకారమే ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. మండమెలిగె పండుగ రోజు కన్నెపల్లి, మేడారం గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాల్లో కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షా తోరణాలు కడతారు. గ్రామ దేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మ, ఎర్రమ్మ, మైసమ్మలకు పూజలు చేస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జాతర జరగాలని, అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడాలని వేడుకుంటారు. ఇక జాతర సమీస్తుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.