Morari Bapu Dwadasa: ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ

ఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మ సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు

Morari Bapu Dwadasa: ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ

Updated On : July 28, 2023 / 7:55 PM IST

Morari Bapu Dwadasa: పవిత్రమైన అధిక్ సావన్(శ్రావణ్) మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామ్ కథ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి అతి పవిత్రమైన కార్యక్రమం ప్రారంభించారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు. జ్యోతిర్లింగ రామ్ కథ రైలు యాత్ర పేరుతో 2023 జూలై 22న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన ఈ వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమం వారణాసి, జార్ఖండ్‌లలో జ్యోతిర్లింగ యాత్రను పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఇప్పటికే కేదార్‌నాథ్, కాశీ విశ్వనాథ్, బైద్యనాథ్ లలో ముగించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని పవిత్రమైన మల్లికార్జున స్వామి చెంతకు చేరింది.

Esha Gupta : ఈషా గుప్తా కూడా సమంతలా బాధపడుతుందా..? ఆమె తీసుకున్న హైపర్బేరిక్ థెరపీనే ఈమె కూడా..!

విశిష్టమైన కార్యక్రమం దేశంలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంపై అవగాహనను పెంపొందించడానికి, సనాతన ధర్మ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి, శ్రీరాముడు మరియు జ్యోతిర్లింగాల బోధనల మధ్య బంధాన్ని వివరించడానికి చేపట్టబడింది. జూలై 22న కేదార్‌నాథ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 18 రోజుల పాటు సాగి, 8 ఆగస్టు 2023న గుజరాత్‌లోని బాపు గ్రామమైన తల్గజర్దా వద్ద ముగుస్తుంది.

Sakshi talks about MS Dhoni : ధోని గురించి చెప్పిన సాక్షి.. ఆనందంలో అభిమానులు.. వీడియో వైర‌ల్‌

ఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మ సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు. కైలాష్ భారత్ గౌరవ్, చిత్రకూట్ భారత్ గౌరవ్ అనే రెండు ప్రత్యేక రైళ్లలో ఈ యాత్ర సాగుతోంది. జ్యోతిర్లింగంతో పాటు, భక్తులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రదేశాలను సైతం సందర్శిస్తారు.