సైనికులతోటే మోదీపావళి

  • Published By: chvmurthy ,Published On : October 27, 2019 / 03:24 AM IST
సైనికులతోటే మోదీపావళి

Updated On : October 27, 2019 / 3:24 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్నారు.  

తొలి ఏడాది ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుధ్ధ క్షేత్రంగా పేరు పొందిన సియాచిన్ లో చేసుకున్నారు. 2015 లో పంజాబ్ సరిహద్దుల్లో , 2016 లో హిమాచల్ ప్రదేశ్ లోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళజవాన్లతో జరుపుకున్నారు.

2017 లో జమ్మూ కాశ్మీర్ లోని గురేజ్ వద్ద, 2018 లో ఉత్తరాఖండ్ లో భారత్ చైనా సరిహద్దుల్లోని ఐటీబీపీ సిబ్బిందితోనూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మోడీ దీపావళి పండుగ జరపుకునే ప్రదేశాన్ని చివరి వరకు వెల్లడించరు. ట్విట్టర్ ద్వారానే వెల్లడిస్తారు.