Tirumala : సెప్టెంబరు నెల వసతి కోటా విడుదల చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమలలో వసతి కోటాను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Tirumala Cottages
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమలలో వసతి కోటాను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అదేవిధంగా, ఇవాళ ఉదయం 11 గంటలకు జూలై 12, 15, 17 తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడమైనది.