Maha Kumbh Mela 2025 : కాసుల వర్షం కురిపిస్తున్న కుంభమేళా..! రూ.2 లక్షల నుంచి 4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్..! ఎలాగంటే..

పవిత్రత, పుణ్యం మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి ఉంది కుంభమేళాకు.

Maha Kumbh Mela 2025 : కాసుల వర్షం కురిపిస్తున్న కుంభమేళా..! రూ.2 లక్షల నుంచి 4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్..! ఎలాగంటే..

Updated On : January 15, 2025 / 7:08 PM IST

Maha Kumbh Mela 2025 : అన్ని రాష్ట్రాలది, అందరిదీ.. దారులన్నీ కుంభమేళా వైపే. త్రివేణి సంగమ తీరం కిటకిటలాడుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. రోజును మంచి రోజు భక్తుల తాకిడి పెరుగుతోంది. భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా, కుంభమేళా కాసుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తక్కువలో తక్కువగా 2లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.

కుంభమేళాకు ముందు, కుంభమేళాకు తర్వాత అన్నట్లుగా యూపీ ఎకానమీ కనిపించబోతోందా?
పవిత్రత, పుణ్యం మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి ఉంది కుంభమేళాకు. ఆర్థిక కార్యకలాపాలను మహా కుంభమేళా వేగవంతం చేసే అవకాశం ఉంది. 2 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సరే. మరి అదెలా వస్తుంది? ఆర్థిక రంగంపై కుంభమేళా ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. కుంభమేళాకు ముందు, కుంభమేళాకు తర్వాత అన్నట్లుగా యూపీ ఎకానమీ కనిపించబోతోంది?

Also Read : ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. హాజరుకానున్న ముగ్గురు టెక్ దిగ్గజాలు.. ఎవరెవరంటే?

భక్తులకు పుణ్యమే కాదు.. ఉపాధి, ఉద్యోగం కూడా..
కుంభమేళాతో భక్తులకు పుణ్యం మాత్రమే కాదు.. చాలామందికి ఉపాధి, ఉద్యోగం కూడా. 2013లో కుంభమేళా నిర్వహించినప్పుడు పండుగ ఏర్పాట్లలో భాగంగానే లక్ష మందికిపైగా ఉద్యోగం లభించింది. 12ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అవసరాలూ పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగాయి. ఈసారి కుంభమేళాలో ఎంతమందికి ఉపాధి దక్కుతుంది అన్నదానిపై ఈజీగా ఓ అంచనాకు రావొచ్చు.

Mahakumbh 2025

Mahakumbh 2025

మహాకుంభమేళా అన్నది కేవలం ఆధ్యాత్మిక శోభ మాత్రమే కాదు. ఇది భారీ ఆర్థిక ఇంజన్ కూడా. యాత్రికులకు అద్భుత అనుభవాన్ని అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఉపాధి కల్పనపై యూపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇదే ఇప్పుడు ఆదాయానికి మార్గం చూపించబోతోంది.

హోటల్స్, ట్రాన్స్ పోర్ట్, టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు..
దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారికి సదుపాయాలు అందించే ప్రాసెస్ లో వాళ్లు సౌకర్యాలు అందుకునే విధానంలో లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది. హోటల్స్ తో పాటు ట్రాన్స్ పోర్ట్, టూరిజం, రిటైల్ రంగాల నుంచి పూలు అమ్ముకునే వాళ్లు, రిక్షా నడుపుకునే వాళ్లు, చేనేత ఉత్పత్తులు విక్రయించే వాళ్లు.. ఇలా చాలామందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది.

స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, తాత్కాలిక లాడ్జ్ ల ద్వారానే రూ.40వేల కోట్ల ఆదాయం..!
స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, తాత్కాలిక లాడ్జ్ ల ద్వారానే 40వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ అంచనా. ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కెట్స్, జ్యూస్ లు, భోజనం వంటి వాటితో రూ.20వేల కోట్ల వ్యాపారం జరగనుంది. నూనె, దీపాలు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ధూపం వంటి పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో 20వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి.

Maha Kumbh Mela

ట్యాక్సీలు, సరకు రవాణా వంటి సేవలతో రూ.10వేల కోట్ల ఆదాయం..!
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ట్యాక్సీలు, సరకు రవాణా వంటి సేవలతో రూ.10వేల కోట్లు.. టూరిస్ట్ గైడ్ లు, ట్రావెల్ ప్యాకేజీలతో మరో 10వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇక మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇతర ఔషధాలతో 3వేల కోట్లు.. ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో వెయ్యి కోట్లు.. మీడియాలో ప్రకటనలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో 10వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. మహాకుంభమేళాకు రాబోయే కోట్లాది మంది భక్తులు యూపీ ఆర్థిక వ్యవస్థను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 45 రోజుల ఉత్సవం యూపీ ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేయడం ఖాయం.

 

Also Read : నాగ సాధ్విలు ఎవరు? మహా కుంభమేళా 2025 యోధుల గురించి అంతగా తెలియని 7 వాస్తవాలివే!