Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం.. యూపీలోని ఈ ఆలయాల్లో సమర్పించే నైవేద్యాలపై ఆంక్షలు..!

Tirumala Laddu Row : ఇకపై ఆలయాలకు భక్తులు తీసుకొచ్చే ప్రసాదాల్లో లడ్లు, స్వీట్లపై నిషేధం విధించారు. ఇతర ప్రాసెస్ చేసిన వస్తువులను కూడా అనుమతించరు. బదులుగా కొబ్బరి, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ప్రసాదంగా సమర్పించవచ్చు.

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం.. యూపీలోని ఈ ఆలయాల్లో సమర్పించే నైవేద్యాలపై ఆంక్షలు..!

No sweets in UP temples, devotees told to offer coconut and fruits

Updated On : September 26, 2024 / 8:49 PM IST

Tirumala Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో అందించే ‘కల్తీ’ లడ్డూ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ప్రసాదం నాణత్యపై ప్రత్యేకించి దృష్టిసారించాయి. ప్రధానంగా యూపీలోని ప్రయాగ్రాజ్లో కొన్ని దేవాలయాల్లో భక్తులు సమర్పించే నైవేధ్యాలపై అక్కడి ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు.

Read Also : Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభం.. టీటీడీ ఈవో ఏమన్నారంటే..

ఇకపై ఆలయాలకు భక్తులు తీసుకొచ్చే ప్రసాదాల్లో లడ్లు, స్వీట్లపై నిషేధం విధించారు. ఇతర ప్రాసెస్ చేసిన వస్తువులను కూడా అనుమతించరు. వీటికి బదులుగా కొబ్బరి, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ప్రసాదంగా తీసుకురావాలని భక్తులకు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ఈ ఆంక్షలను విధించారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ లలితా దేవి ఆలయ ప్రధాన అర్చకుడు శివ్ మురత్ మిశ్రా మాట్లాడుతూ.. మంగళవారం జరిగిన ఆలయ నిర్వాహకుల సమావేశంలో ఆలయంలోని అమ్మవారికి తీపి ప్రసాదం ఇవ్వకూడదని నిర్ణయించారు. కానీ, భక్తులు కొబ్బరి, పండ్లు, డ్రై ఫ్రూట్స్, యాలకులు మొదలైన వాటిని అందించమని అభ్యర్థించారు. రాబోయే రోజుల్లో ఆలయ ప్రాంగణంలో భక్తులకు స్వచ్ఛమైన స్వీట్లను అందుబాటులో ఉంచే దుకాణాలు తెరిచే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఆలయం బయటి స్వీట్లు, ప్రసాదాలపై నిషేధం :
భక్తులు బయటి నుంచి మిఠాయిలు, ప్రసాదాలు తీసుకురాకుండా నిషేధం విధించినట్లు ఆలోప్ శాంకరీ దేవి ఆలయ ప్రధాన పోషకుడు, పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పురి మహారాజ్ తెలిపారు. యమునా ఒడ్డున ఉన్న మంకమేశ్వర్ ఆలయానికి చెందిన మహంత్ శ్రీధరానంద్ బ్రహ్మచారి జీ మహారాజ్ మాట్లాడుతూ.. “తిరుపతి లడ్డూ వివాదం తరువాత, మేం కూడా మంకమేశ్వరాలయానికి బయటి నుంచి ప్రసాదం తీసుకురావడాన్ని నిషేధించాం.

ఆలయం వెలుపల దుకాణాల్లో లభించే ‘లడ్డూ’ను పరీక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశాం. విచారణలో స్వీట్ల స్వచ్ఛత స్పష్టమయ్యే వరకు, వాటిని ఆలయంలో సమర్పించేందుకు అనుమతి ఉండదు. ఏది ఏమైనా స్వీట్లు కన్నా పండ్లను ఎక్కువగా నమ్ముతాం’’ అని ఆయన పేర్కొన్నారు.

సంగం తీరంలో ఉన్న బడే హనుమాన్ ఆలయ పోషకుడు, శ్రీమత్ బాఘంబరి గడ్డి అధిపతి మహంత్ బల్బీర్ గిరి జీ మహారాజ్ మాట్లాడుతూ.. “ఆలయ కారిడార్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఆలయ నిర్వాహకులు స్వయంగా లడ్డూని సిద్ధం చేస్తారు. శ్రీబడే హనుమాన్ ఆలయానికి లడ్డూ ప్రసాదం అందజేస్తారు” అని చెప్పారు.

అంతకుముందు.. లక్నోలోని ప్రసిద్ధ మంకమేశ్వర్ ఆలయం బయటి నుంచి భక్తులు కొనుగోలు చేసే ‘లడ్డూ’ ప్రసాదాలను పూర్తిగా నిషేధించింది. ఇంట్లో తయారుచేసిన ‘ప్రసాదం’ లేదా పండ్లను భక్తులు అందించవచ్చునని సూచించింది. ఆలయ నిర్వాహకులు ప్రాంగణంలో అందించే ప్రసాదం స్వచ్ఛతను నిర్ధారించడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. ప్రసాదం నాణ్యత తనిఖీలు నిర్వహించడంతో పాటు వారి ఆలయ ప్రసాదం తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.

Read Also : Tirumala Prasadam: తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..