Tirumala Tickets: ఆన్‌లైన్‌లో తిరుమల దర్శనం టిక్కెట్లు.. అదనంగా రోజుకు 3వేల టికెట్లు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.

Tirumala Tickets: ఆన్‌లైన్‌లో తిరుమల దర్శనం టిక్కెట్లు.. అదనంగా రోజుకు 3వేల టికెట్లు

Tirumala

Updated On : July 28, 2021 / 12:46 PM IST

Tirumala Rs 300 August 2021 Quota Tickets for August 2021: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్ట్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను.. ప్రస్తుతం ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం ఆన్‌లైన్ కోటా ఇప్పటికే విడుదల చేశారు.

ఉదయం 11 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచింది టీటీడీ. నేటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అదనంగా రోజుకు మూడు వేల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లకు విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు నెల కోటాలో అదనంగా రోజుకు 3వేల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ. అవి కూడా నిమిషాల్లోనే అమ్ముడుపోతున్నట్లు చెబుతున్నారు అధికారులు.

ఇక తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న దళారులపై ఫిర్యాదులు అందుతున్నట్లు టీటీడీ చెబుతుంది. రూ.300 టికెట్లు బుక్ చేస్తామని మోసం చేస్తూ కొంతమంది తిరుమలలో తిరుగుతున్నట్లుగా కూడా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. టికెట్లు ఇస్తామని మోసం చేసినవారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది.