TTD Board Meeting : ఈరోజు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి మరి కొద్ది సేపట్లో తిరుమలలో సమావేశం కానుంది.

TTD Board Meeting : ఈరోజు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం

Ttd Board Meeting

Updated On : December 11, 2021 / 8:54 AM IST

TTD Board Meeting : తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి మరి కొద్ది సేపట్లో తిరుమలలో సమావేశం కానుంది. చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో సుమారు 55 అంశాలను చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ప్రసాదాల తయారీలో ముడి సరుకుల కొనుగోళ్లకు ఆమోదం…తిరుమల, తిరుపతిల్లో పలు ఇంజనీరింగ్ పనులకు ఆమోదం….తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే జీ. ఎన్.సి, ఏఎన్సీ, హెచ్.వీ.సి, మొదటి, రెండు, మూడవ సత్రాల్లో 25 లీటర్ల గీజర్లు ఏర్పాటు్లు వంటి పనలకు బోర్డు నిర్ణయం తీసుకోనుంది.
Also Read : Comet Leonard : డిసెంబర్ 12న ఆకాశంలో అద్భుతం.. 70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న ఆ గ్రీన్‌ కలర్‌ తోకచుక్క చూడాలంటే?
తమిళనాడు ఉలందూరు పేటలో నిర్మించే  శ్రీవారి ఆలయ నిర్మాణం పనులకు కూడా పాలకమండలి ఆమోదం తెలపనుంది. తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేళ్ల లీజ్ పొడిగింపు…శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పనిచేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపై టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది.