TTD : 100 కిలోల బంగారంతో ఆలయ విమాన గోపురానికి తాపడం

తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.

TTD : 100 కిలోల బంగారంతో ఆలయ విమాన గోపురానికి తాపడం

Govinda Gold

Updated On : August 7, 2021 / 3:32 PM IST

Govindaraja Temple : తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది. అంతేగాకుండా..హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని, హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం టీసీఎస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

Read More : Allu Arjun : కూతురి కోసం శాకుంత‌లం సెట్‌కి వెళ్లిన అల్లు అర్జున్

మరోవైపు…తిరుమల తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమౌతోంది. జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 5.32 లక్షల మంది ఉండగా..జూలైలో హుండీ ఆదాయం రూ. 55.58 కోట్లు సమకూరింది. ఈ హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 51.97 లక్షలుగా ఉంది. లడ్డూ విక్రయాల ద్వారా రూ. 35.26 లక్షల ఆదాయం వచ్చింది. అన్నప్రసాదంలో భోజనం చేసిన భక్తుల సంఖ్య 7.13 లక్షలుగా ఉంది.

Read More : Dog Shopping : ఔరా.. స్వయంగా షాపుకెళ్లి వస్తువులు తెస్తున్న శునకం

ఇక తిరుపతిలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం విషయానికి వస్తే..అత్యంత పురాతనమైంది. అపురూప శిల్ప కళా సంపద దీని సొంతం. వెయ్యి సంవత్సరాలకు పైగా పూజలు అందుకొంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారిని దర్శించేందుకు అనేక మంది ఇక్కడకు వస్తుంటారు. తిరుపతి నగరం ఏర్పడకముందే…ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం. తమిళనాడులోని చిదంబరం నుంచి తెప్పించిన గోవిందరాజస్వామి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి…ఆయన ప్రతిష్టించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో, కోనెటి గట్టున ఈ ఆలయం ఉంది. గోవిందరాజ స్వామి…శ్రీ వెంకటేశ్వరునికి అన్న అని అంటుంటారు. తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తుల్లో కొంతమంది తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకొన్న తర్వాత కొండ ఎక్కేవారు.