TTD Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 22న శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకు 2వేల టికెట్లు విడుదల చేస్తారు.

TTD Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 22న శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

Updated On : December 20, 2022 / 7:44 PM IST

TTD Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకు 2వేల టికెట్లు విడుదల చేస్తారు.

Also Read..Tirumala..Srivani Darshan Ticket : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో

శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. రోజుకు 2వేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Also Read..Tirumala Vaikunta Ekadasi : రోజుకు 80వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం

భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుందని టీటీడీ తెలిపింది.