I Love Boxing : పంచుల్లో చిన్నారి రికార్డు, అత్యంత వేగంగా వంద బాక్సింగ్ పంచ్‌‌లు

పంచ్‌‌ల్లో రికార్డు నెలకొల్పాడు ఆ చిన్నారి. పట్టుమని పదేళ్లు కూడా లేవు. అత్యంత వేగంగా వంద బాక్సింగ్ పంచ్ లు కురిపించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇతను విదేశాలకు చెందిన చిన్నారి కాదు..భారతదేశానికి చెందిన వాడు.

I Love Boxing : పంచుల్లో చిన్నారి రికార్డు, అత్యంత వేగంగా వంద బాక్సింగ్ పంచ్‌‌లు

Boxing

Updated On : July 10, 2021 / 5:06 PM IST

Fastest Hundred Boxing Punches : పంచ్‌‌ల్లో రికార్డు నెలకొల్పాడు ఆ చిన్నారి. పట్టుమని పదేళ్లు కూడా లేవు. అత్యంత వేగంగా వంద బాక్సింగ్ పంచ్ లు కురిపించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇతను విదేశాలకు చెందిన చిన్నారి కాదు..భారతదేశానికి చెందిన వాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఇతని కుటుంబం నివాసం ఉంటోంది. అంత వేగంగా పంచ్ లు కురిపించడం వెనుక నిరంతరం ప్రాక్టీస్ దాగి ఉంది. మరి ఈ చిన్నారి గురించి తెలుసుకోవాలంటే..చదవండి..

Read More : Corona Delta Variant : ‘డెల్టా’ మహా ప్రమాదకారి.. ఒకరి నుంచి 8మందికి వ్యాప్తి.. కేసులు పెరగడానికి కారణమిదే..

వయస్సు 05 ఏళ్లు : 
అరిందమ్ గౌర్ వయస్సు 05 ఏళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇతనికి బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. పుట్టిన రోజు బహుమతిగా తండ్రి పంచ్ బ్యాగ్ ఇచ్చారు. దానిపైనే ప్రతి రోజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయసాగాడు. తక్కువ సమయంలో ఎక్కువ బాక్సింగ్‌ పంచ్‌లు కురిపించిన చిన్నారిగా రికార్డు నెలకొల్పాడు. ఐదు సంవత్సరాల 5 నెలల వయస్సులోనే 13.7 సెకన్లలో 100 బాక్సింగ్ పంచ్ లు ఇచ్చి..రికార్డు నెలకొల్పాడు.

Read More : Covishield Green Pass : కోవిషీల్డ్‌కు గ్రీన్ ‘పాస్’ సిగ్నల్.. 15 యూరోపియన్ దేశాలకు వెళ్లొచ్చు!

బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం : 
రికార్డు సృష్టించిన సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ…తనకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టమని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గంటల పాటు శిక్షణ తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ తరపున భవిష్యత్ లో బాక్సింగ్ క్రీడలో ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు.

Read More : Bhuma Akhila Priya Husband :ఫేక్ కరోనా సర్టిఫికెట్ పుట్టించిన మాజీమంత్రి అఖిలప్రియ భర్త

పుట్టిన రోజు గిప్ట్ : 
ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ…పుట్టిన రోజు సందర్భంగా…ఒక పంచ్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇచ్చానని, ఇది తీసుకరావాలని చాలాసార్లు అడిగాడని తెలిపారు. అయితే..దీని గురించి ఎక్కడ తెలుసుకున్నాడో తెలియదని తెలిపారు. మొత్తానికి తక్కువ సమయంలో ఎక్కువ పంచ్ లు విసిరిన ఈ చిచ్చరపిడుగుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.