Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు.

Abhishek Sharma Creates HistoryAchieves Never Done Before Feat Against Pakistan
Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 21) పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు తొలి బంతికే సిక్స్ కొట్టిన టీమ్ఇండియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈటోర్నీలోనే యూఏఈ పై తొలిసారి ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరో వరల్డ్ రికార్డు సైతం నెలకొల్పాడు. అతి తక్కువ బంతులు, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ రికార్డు ను బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 331 బంతులు
* ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) – 366 బంతులు
* ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) – 409 బంతులు
* హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) – 492 బంతులు
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 510 బంతులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అతి ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* అభిషేక్ శర్మ (భారత్) – 20 ఇన్నింగ్స్‌లు
* ఎవిన్ లూయిస్ (భారత్) – 20 ఇన్నింగ్స్‌లు
* హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) – 22 ఇన్నింగ్స్‌లు
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 25 ఇన్నింగ్స్‌లు
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 29 ఇన్నింగ్స్‌లు
యువీ రికార్డు బ్రేక్..
పాకిస్తాన్ టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యువీ 29 బంతుల్లో పాక్ పై హాఫ్ సెంచరీ చేయగా అభిషేక్ శర్మ 24 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 39 బంతులు ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 74 పరుగులు సాధించాడు. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ (47; 28 బంతుల్లో 8 ఫోర్లు), తిలక్ శర్మ (30 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడడంతో 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో శివమ్ దూబె రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు.