AFG vs WI : షమర్ హ్యాట్రిక్.. పరువు దక్కించుకున్న వెస్టిండీస్.. మూడో టీ20లో అఫ్గాన్ పై విజయం
నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి వెస్టిండీస్ పరువు (AFG vs WI) దక్కించుకుంది.
Shamar Springer Hattrick West Indies Win 3rd T20 against Afghanistan
AFG vs WI : నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి వెస్టిండీస్ పరువు దక్కించుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ పై వెస్టిండీస్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలుపొందినప్పటికి కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరీస్‌ను అఫ్గాన్ 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (47; 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. మాథ్యూ ఫోర్డ్ (27), జాన్సన్ ఛార్లెస్ (17), షామర్ స్ప్రింగర్ (16 నాటౌట్) పర్వాలేదనిపించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియావుర్ రెహమాన్ షరీఫీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ లు తలా రెండు వికెట్లు తీశారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్..
అనంతరం రహానుల్లా గుర్బాజ్ (71; 58 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇబ్రహీం జద్రాన్ (28; 27 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినప్పటికి మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో 152 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది.
West Indies win the third T20I, Afghanistan take the Series 2-1#AfghanAtalan fell short by 15 runs in the third T20I match, but with victories in the first two games, secured a 2-1 victory in the e& Cup T20I series, powered by SuperCola.
Read More: https://t.co/g0IewtES5Q pic.twitter.com/62rObLwNNq
— Afghanistan Cricket Board (@ACBofficials) January 22, 2026
వీరిద్దరు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. వెస్టిండీస్ బౌలర్ షామర్ స్ప్రింగర్ హ్యాట్రిక్ తీశాడు. మొత్తంగా అతడు నాలుగు వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. మిగిలిన విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, ఖారీ పియరీ, రామోన్ సిమండ్స్ లు తలా ఓ వికెట్ సాధించారు.
