మోడీ తర్వాత ధోనీనే..

భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో నరేంద్ర మోడీ తర్వాతి స్థానం మహేంద్ర సింగ్ ధోనీకే దక్కింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో లేడని విమర్శలు ఎదుర్కొంటున్నా మహేంద్రుడిదే పైచేయిగా నిలిచింది. మహిళల విభాగంలో భారత్ నుంచి మేరీ కోమ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. 2019 సంవత్సరానికి గానూ చేసిన సర్వేలో భారత్ నుంచి మోడీ, మేరీ కోమ్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు.
మోడీ 15.66శాతం అనుసరిస్తుండగా, ధోనీ 8.58శాతం మంది నిలిచారు. ఈ సర్వేలో తర్వాతి స్థానంలో నిలిచిన దిగ్గజాలు రతన్ టాటా 8.02శాతం, బరాక్ ఒబామా 7.36శాతం, బిల్ గేట్స్ 6.96శాతం ఉన్నారు. వీరిలో కోహ్లీ చాలా తక్కువగా అంటే 4.46శాతం మంది మాత్రమే అనుసరిస్తున్నారట. సచిన్.. కోహ్లీ కంటే బెటర్‌గానే అంటే 5.81శాతంతో నిలిచాడు. మేరీ కోమ్‌కు 10.36శాతం మంది అభిమానులు ఉన్నారు.