IPL 2019: రహానె దొరికిపోయాడు.. రూ.12లక్షలు జరిమానా

చెన్నై వేదికగా సూపర్ కింగ్స్‌తో తలపడ్డ రాజస్థాన్ రాయల్స్ 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య చెన్నైమ్యాచ్ గెలుచుకుంది. మ్యాచ్ ముగిసేందుకు ఎక్కువ సమయమే పట్టింది. దానికి కారణం.. రాజస్థాన్ స్లో ఓవర్ రేట్ వహించడమే. దీంతో రాజస్థాన్ కెప్టెన్ అజింకా రహానెపై రూ. 12లక్షల జరిమానాను విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
‘రాజస్థాన్ రాయల్స్‌కు ఇది మొదటిసారి కావడంతో రూ.12లక్షల జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి ప్రకారం.. కనీస ఓవర్ రేట్ కంటే తక్కువ కొనసాగించిన జట్టుకు రూ.12లక్షల జరిమానా విధించాలి’ అని ఐపీఎల్ అధికారి తెలిపింది.
రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ధాటికి నిలవలేకపోయింది. తన తర్వాతి మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సొంతగడ్డపై ఆడనుంది రాజస్థాన్.
Read Also : KXIP vs DC: ఢిల్లీపై పంజాబ్ పోరాటం ఫలించేనా..