అక్కడ నేనేం తబలా వాయించడానికి లేను: రవిశాస్త్రి

యువ క్రికెటర్ రిషబ్ పంత్ షాట్ సెలక్షన్‌పై విమర్శల దాడి పెరిగిపోతుంది. పరిమితి ఓవర్ల ఫార్మాట్‌లో గేమ్ ముగించడం చేతకావడం లేదని ఆడిపోసుకుంటున్నారు. ఈ మేర టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్‌ను వెనకేసుకొచ్చాడు. తాను ఓ స్పెషల్ కిడ్ అంటూ పొగిడేశాడు.
‘టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఏం చేయాలో చెప్పొద్దు. పంత్ ప్రదర్శనపై వస్తున్న లింకులను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా తడబడుతున్నారంటే వారిని ఫామ్‌లోకి తెచ్చేందుకే నేనున్నా. నేనక్కడ తబలా ఆడించడానికి లేను. అతనొక వరల్డ్ క్లాస్ ప్లేయర్. విధ్వంసకర ప్లేయర్ కాగలడు. మా తరపు నుంచి అతనికి అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపడ ప్రోత్సాహం అందిస్తున్నాం’
‘ఎక్స్‌పర్ట్స్‌లు ఏమైనా మాట్లాడగలరు. పంత్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. జట్టులో ఉండటానికి సరిపడ ఇప్పటికే చేసేశాడు. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్.. 229పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 19 ఇన్నింగ్స్‌కు 325పరుగులు చేయగలిగాడు.