కేటీఆర్ సర్.. హైదరాబాద్ క్రికెట్‌ అంతా అవినీతే

కేటీఆర్ సర్.. హైదరాబాద్ క్రికెట్‌ అంతా అవినీతే

Updated On : November 23, 2019 / 12:29 PM IST

హైదరాబాద్ క్రికెట్‌లో అవినీతి జరుగుతోందని టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆరోపిస్తున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ రూపంలో ఫిర్యాదు ఇచ్చి స్పందించాల్సిందిగా కోరుతున్నాడు. కొద్ది నెలల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

రాయుడు చేసిన ట్వీట్‌లో ‘హలో సర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి బాగా పెరిగిపోయింది. ఇది పరిష్కరించాలని కోరుతున్నాను. చాప కింద నీరులా లంచగొండితనం, అవినీతి పెరిగిపోతుంటే హైదరాబాద్ క్రికెట్ గొప్పగా ఎలా అనిపించుకుంటుంది. ఏసీబీ కేసులతోనే హెచ్‌సీఏ నిండిపోయింది’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. 

సెప్టెంబరు 2019లో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. వరల్డ్ కప్ జట్టులోకి రాయుడుని తీసుకోకపోవడంతో టోర్నమెంట్ చూసేందుకు 3డీ కళ్లద్దాలు కొనుక్కున్నానంటూ చేసిన ట్వీట్ తర్వాత రాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించడం ఇదే తొలిసారి.