Ranji Trophy : అరెరె కోహ్లీ మాయలో పడి.. ఈ విషయాన్ని పట్టించుకోలేదే.. మరో స్టార్ ఆటగాడు విఫలం..
రంజీట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మరో స్టార్ ఆటగాడు విఫలం అయ్యాడు.

Another Indian superstar fails in awaited Ranji Trophy return
టీమ్ఇండియా స్టార్లు ఆటగాళ్లు అందరూ కూడా దేశవాలీ మ్యాచుల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ నిబంధనను విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. రోహిత్ శర్మ, పంత్, యశస్వి జైస్వాల్ లు విఫలం కాగా.. జడేజా, గిల్‌లు రాణించారు. ఇక గురువారం మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు బరిలోకి దిగారు.
చాన్నాళ్ల తరువాత రంజీ మ్యాచ్ బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. క్రీజులో సెటిల్ అయినట్లే కనిపించిన ఈ కర్ణాటక బ్యాటర్ మంచి ప్రారంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం హర్యానా, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 37 బంతులు ఎదుర్కొన్నాడు. 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.
Siraj – Mahira sharma : మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్.. స్పందించిన సానియా..
అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించగా .. అభిమానులకు నిరాశే ఎదురైంది.
2020 ఫిబ్రవరిలో ఈడెన్ గార్డెన్స్‌లో పశ్చిమ బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో చివరి సారిగా రాహుల్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో కర్ణాటక 174 పరుగుల తేడాతో ఓడిపోయింది.
SL vs AUS : ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక ఆసీస్ ఆటగాడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచిన రాహుల్..
గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓ మోస్తర్ ప్రదర్శననే చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్(77), మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (84) మాత్రమే రాణించారు. ఈ క్రమంలో రాహుల్ పై విమర్శల జడివాన మొదలైంది. పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే.